త్సుల్ట్రిమ్ చోంజోర్

లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత

త్సుల్ట్రిమ్ చోంజోర్‌ లడఖ్‌లోని స్టోంగ్డే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త.[1] అతని సామాజిక సేవకు గాను భారత ప్రభుత్వం, 2021 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[2][3]

త్సుల్ట్రిమ్ చోంజోర్
జననం1949
లడఖ్
ఇతర పేర్లుచుల్ట్రిమ్ చోంజోర్
వృత్తిసామాజిక కార్యకర్త
పురస్కారాలుపద్మశ్రీ

సామాజిక సేవ

మార్చు

1965 నుండి 2000 వరకు, అతను ప్రభుత్వ హస్తకళల విభాగంలో ఉద్యోగం చేసాడు.[4] ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడం పట్ల ఆయన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన లాహౌల్, స్పితి జిల్లా లోని దర్చా గ్రామాన్ని, లడఖ్‌ జన్స్‌కార్ లోయలోని కార్గ్యాక్ గ్రామాన్ని కలిపే 38 కిలోమీటర్ల రహదారిని 2014 - 2017 మధ్య కాలంలో చోంజోర్, స్థానికుల సహకారంతో నిర్మించాడు. ఆ రోడ్డు నిర్మాణంతో చోంజోర్ సామాజిక సేవ ప్రారంభమైంది [5] దీని కోసం తన స్వంత నిధులు రూ. 57 లక్షలు ఖర్చు చేసాడు. రోడ్డు నిర్మాణానికి నిధుల కోసం తన పూర్వీకుల ఆస్తిని కూడా విక్రయించాడు. అతనికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వారు ఆ రోడ్డును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు.[6]

మూలాలు

మార్చు
  1. "Padma Awards 2021 announced". pib.gov.in. Retrieved 2023-09-29.
  2. "Padma Shri for linking Zanskar valley with Darcha : The Tribune India". Retrieved 30 September 2023.
  3. "Padma Awards 2021: Check full List of Padma Vibhushan, Padma Bhushan and Padma Shri winners". Jagranjosh.com. 2021-01-27. Retrieved 2023-09-29.
  4. "लद्दाख के सुलट्रिम चोंजोर ने संपत्ति बेचकर बना डाली 38 किलोमीटर सड़क, मिला पद्मश्री सम्मान". Amar Ujala (in హిందీ). Retrieved 2023-09-29.
  5. "Social worker Chultim Chonjor awarded Padma Shri". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  6. "Tsultrim Chonjor" (PDF). hcipos.gov.in. p. 3.