థామస్ చాజికడన్
థామస్ చాజికడన్ (జననం 25 సెప్టెంబర్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎట్టుమనూరు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొట్టాయం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
థామస్ చాజికడన్ | |||
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | జోస్ కె. మణి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొట్టాయం | ||
పదవీ కాలం 1991 – 2011 | |||
తరువాత | కె. సురేష్ కురుప్ | ||
నియోజకవర్గం | ఎట్టుమనూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఎట్టుమనూర్ , ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రం (ప్రస్తుతం కొట్టాయం , కేరళ ), భారతదేశం | 1952 సెప్టెంబరు 25||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కేరళ కాంగ్రెస్ (ఎం) | ||
తల్లిదండ్రులు | సిరియాక్, ఏలియమ్మా | ||
జీవిత భాగస్వామి | ఆన్ థామస్ | ||
నివాసం | SH మౌంట్, కుమారనల్లూర్, కొట్టాయం, కేరళ, 686016 | ||
పూర్వ విద్యార్థి | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుథామస్ చాజికడన్ 1991లో ఏటుమనూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు బాబు చాజికాడన్ ప్రమాదవశాత్తు మరణించడంతో ఉప ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎట్టుమనూరు శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 1996, 2001, 2006 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కేరళ శాసనసభ చైర్మన్ ప్యానెల్ సభ్యుడిగా పని చేశాడు.
థామస్ చాజికడన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొట్టాయం నుండి కేరళ కాంగ్రెస్ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి వి.ఎన్. వాసవన్ పై 1,06,259 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో సామాజిక న్యాయ, సాధికారతపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, కేంద్రంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేసే ఇంధన శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, కేరళ కాంగ్రెస్ (ఎం) పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా పని చేశాడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కేరళ కాంగ్రెస్ అభ్యర్థి ఫ్రాన్సిస్ జార్జ్ చేతిలో ఓడిపోయాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (27 June 2019). "'Fair deal for rubber farmers, green-pilgrim tourism to be top priority'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ The Hindu (12 February 2024). "Lok Sabha polls: KC(M) fields Thomas Chazhikadan from Kottayam" (in Indian English). Retrieved 3 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kottayam". Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.