థోల్ సరస్సు
థోల్ సరస్సు భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలో గల మహెసనా జిల్లాలోని థోల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1912 లో నీటిపారుదల సౌకర్యాల కొరకు నిర్మించారు. ఇది చిత్తడి నేలలతో చుట్టుముట్టబడిన మంచినీటి సరస్సు. ఇది 150 రకాల పక్షులకు ఆవాసంగా ఉంది.[1]
థోల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | థోల్ గ్రామం, గాంధీ నగర్, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 23°22.50′N 72°37.50′E / 23.37500°N 72.62500°E |
సరస్సు రకం | కృత్రిమ సరస్సు |
పరీవాహక విస్తీర్ణం | 15,500 హెక్టారులు (38,000 ఎకరం) |
ప్రవహించే దేశాలు | భారత్ |
ఉపరితల వైశాల్యం | 699 హెక్టారులు (1,730 ఎకరం) |
నీటి ఘనపరిమాణం | 84 మిలియన్ ఘనపు మీటరుs (3.0×10 9 ఘ.అ.) |
చరిత్ర
మార్చుఈ సరస్సును మొదట 1912 లో గైక్వాడ్ రైతులకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి ఒక ట్యాంకుగా నిర్మించారు. [2]
భౌగోళికం
మార్చుఈ సరస్సు 15,500 హెక్టార్ల (38,000 ఎకరాలు) పరీవాహక ప్రాంతం లో పారుతుంది. ఇది మహెసనా జిల్లాలోని పాక్షిక శుష్క మండలంలో పొడి ఆకురాల్చే వృక్షసంపదలో ఉంది.
వివిధ ప్రాంతాల నుండి దూరం
మార్చుఈ సరస్సు థోల్ గ్రామానికి సమీపంలో ఉన్న కలోల్ నుండి 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలో, అహ్మదాబాద్ నుండి 40 కిలోమీటర్ల (25 మైళ్ళు) దూరంలో, మహెసనా జిల్లాలోని మహెసనా నుండి 75 కిలోమీటర్ల (47 మైళ్ళు) దూరంలో ఉంది.[3]
వర్షపాతం,ఉష్ణోగ్రత
మార్చుసరస్సు పరీవాహక ప్రాంతంలో సగటు వార్షిక వర్షపాతం 600 మిల్లీమీటర్లు (24 అంగుళాలు) గా ఉంటుంది. కనిష్టంగా 100 మిల్లీమీటర్లు (3.9 అంగుళాలు), గరిష్టంగా 800 మిల్లీమీటర్లు (31 అంగుళాలు) ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 43 ° C (109 ° F), 8 ° C (46 ° F) గా ఉన్నాయి.[4]
నీటి నిల్వ సామర్థ్యం
మార్చుఈ సరస్సు నిల్వ సామర్థ్యం 84 మిలియన్ క్యూబిక్ మీటర్లు (3.0 × 109 క్యూబిక్ అడుగులు). దీని నీటి విస్తరణ ప్రాంతం 699 హెక్టార్లు (1,730 ఎకరాలు). సరస్సు తీరం పొడవు 5.62 కిలోమీటర్లు (3.49 మైళ్ళు).[5]
నిర్వహణ, అభివృద్ధి
మార్చుఈ సరస్సు నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలు గుజరాత్ ప్రభుత్వ అటవీ శాఖ, నీటిపారుదల శాఖల ఆధీనంలో ఉన్నాయి.[6]
మూలాలు
మార్చు- ↑ "Thol Lake Wildlife Sanctuary". BirdLife International. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 17 April 2015.
- ↑ "Thol Sanctuary, Ahmedabad, Gujarat". Kolkata Birds.com. Archived from the original on 12 మే 2015. Retrieved 17 April 2015.
- ↑ "Draft Notification declaring the area around Thol Wildlife Sanctuary, Gujarat as Eco-Sensitive Zone". Ministry of Environment and Forests. 6 January 2013. Retrieved 17 April 2015.
- ↑ name=Global>"Status of Lifeforms of Angiosperms Found at 'Thol Lake Wildlife Sanctuary' (North Gujarat) in Comparison of Normal Biological Spectrum (NBS)" (pdf). International Journal of Scientific Research. Retrieved 17 April 2015.
- ↑ "hol Wildlife Sanctuary at Mehsana".
- ↑ Rahmani & Islam 2004, p. 402.