దండమూడి రాజగోపాలరావు
దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1] ఈయన 1963లో విడుదలైన నర్తనశాల[2] సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.
దండమూడి రాజగోపాలరావు | |
---|---|
జననం | దండమూడి రాజగోపాలరావు అక్టోబరు 16, 1916 గండిగుంట, కృష్ణా జిల్లా |
మరణం | ఆగష్టు 6, 1981 |
ప్రసిద్ధి | ప్రముఖ క్రీడాకారుడు నర్తనశాల చిత్రంలో భీముడు పాత్రధారి. |
పిల్లలు | ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి |
రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు, దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.
రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు - ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి "దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం" అని నామకరణం చేశారు.[3] దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.
మూలాలు
మార్చు- ↑ http://www.doha-2006.com/gis/menuroot/sports/Weightlifting_HR.aspx-id=WL.html[permanent dead link]
- ↑ http://www.imdb.com/title/tt0263778/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-06. Retrieved 2007-09-13.