దండి బీచ్

దండి బీచ్ లో మహాత్మా గాంధీ స్మారకం గుజరాత్లోని దండి గ్రామంలో ఉన్న ప్రముఖ బీచ్ లలో ఒకటి.

దండి బీచ్ గుజరాత్‌లోని దండి గ్రామంలో ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఒకటి. [1] అరేబియా సముద్ర తీర బీచ్ లలో పరిశుభ్రమైన బీచ్ లలో దండి బీచ్ ఒకటి. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్) నుండి దండి వరకు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించినందున ఈ బీచ్ చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత పొందింది. ఉప్పు సత్యాగ్రహం తర్వాత మహాత్మా గాంధీ బ్రిటిష్ వారి ఉప్పు పన్ను చట్టాన్ని ఉల్లంఘించిన బీచ్ ఇది.

దండి వద్ద మహాత్మా గాంధీ స్మారక చిహ్నం

గాంధీ స్మారక చిహ్నాలు మార్చు

భారతదేశ చరిత్రలో దండి బీచ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి మహాత్మా గాంధీజీ కి సంబంధించిన రెండు స్మారక చిహ్నాలను దండి బీచ్‌లో ఉంచారు. ఒక స్మారక చిహ్నం గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన విజయానికి గుర్తుగా ఇండియా గేట్ లాంటి నిర్మాణం. రెండవ స్మారక చిహ్నం ఉప్పునీటిని పట్టుకున్న గాంధీ విగ్రహం. [2]

మూలాలు మార్చు

 

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-19. Retrieved 2021-10-02.
  2. https://www.tripadvisor.in/LocationPhotoDirectLink-g1389100-d9681918-i1656283.
"https://te.wikipedia.org/w/index.php?title=దండి_బీచ్&oldid=3431198" నుండి వెలికితీశారు