దండి (ఆంగ్లం : Daṇḍin) 6 -7 శతాబ్దాలకు చెందిన సంస్కృత రచయిత, కవి. ఇతను రచించిన ప్రసిద్ధ సాహిత్యఖండము దశకుమార చరితమ్, మొదటి సారిగా 1927 లో తర్జుమా చేయబడింది. దీని పేరు "హిందూ కథలు" (Hindoo Tales), లేదా "పది యువరాజుల సాహసగాధలు". ఇతను తన "కావ్యదర్శనము"తో ప్రసిద్ధి పొందాడు. ఈ గ్రంథం సాహితీపరంగా ఓ ప్రసిద్ధ కావ్యం (Kāvya). ఇతని రచనలన్నీ సంస్కృతభాషలో ఉన్నాయి.

కావ్యదర్శము (కావ్య దర్శ)సవరించు

సంస్కృతభాష సాహితీరంగంలో కావ్యదర్శ (The Kāvyādarśa) నేటికినీ లభ్యమవుతున్న సశాస్త్రీయ కవితా విధానము. "కావ్యదర్శము", భట్టి రచించిన భట్టి కావ్యం చే ప్రేరేపితమని గమనించబడినది [1].

కావ్యదర్శనంలో దండి, కావ్యానికి అందం అందులో భాషాశిల్ప పరికరాల యొక్క ఉపయోగం నుండే సంక్రమిస్తుందని వాదించాడు. అలాంటి 36 రకాల భాషాశిల్ప పరికరాలను గుర్తించాడు. కావ్యం, శ్లేష (punning), ప్రసాద (favour), సమత (sameness), మాధుర్య (అందం), అర్ధవ్యక్తి (interpretation), ఓజస్సు (బలం) వంటి గుణాలతో గుణాత్మకంగా ఉండాలని భావించే గుణప్రస్థాన ధోరణిని లేదా భావస్రవంతికి దండి మూలపురుషుడు. కవిత్వంలో ఈ గుణాలు ఒక్కొక్కటి లేదా కొన్ని గుణాలు కలిసి సమ్మిళితమై ఉంటాయి.

పెద్ద పెద్ద క్లిష్టమైన వాక్యాలకు, సంధి, సమాస భూషిత దీర్ఘ సంక్లిష్ట పదాల వాడుకకూ దండి పెట్టింది పేరు. ఈయన వ్రాసిన కొన్ని వాక్యాలు అర్ధపేజీ పొడవున్నూ, కొన్ని పదాలు అరఫంక్తి పొడవున్నూ ఉండేవి.

దశకుమార చరితముసవరించు

దశకుమారచరితము, రాజసం, ప్రేమాయణం కలిగిన పది యువరాజుల గాథ. దీనిలో సాధారణ జీవన గాథలు, భారత సంస్కృతి ఉట్టిపడేలా సాగుతాయి. ఆ కాలమునాటి సంస్కృత సభ్యతా, సాహితీ సరళి గోచరిస్తాయి. ఈ దశకుమారచరితములో మూడు భాగాలున్నవి, అవి (1) పూర్వపీఠకము, (2) దశకుమార చరితము, (3) ఉత్తరపీఠకము.

ఈ పుస్తకాన్ని తెలుగులోనికి ఆంధ్ర దశకుమారచరితము[2] అనే పేరుతో కేతన పద్యానువాదం, వేదము వేంకటరాయశాస్త్రి గద్యానువాదం చేశారు.

గ్రంధాలుసవరించు

  • M.R. Kale, 2003, Daśakumāracarita of Daṇḍin (Text with Sanskrit Commentary Various Readings, a Literal English Translation, Explanatory and Critical Notes and an Exhaustive Introduction), New Delhi, ISBN : 8120801717.
  • Isabelle Onians (trans.): What Ten Young Men Did. New York: క్లే సంస్కృత గ్రంథాలయం, 2005. 651pp. Facing romanized Sanskrit text and translation. ISBN 0-8147-6206-9.

పాదపీఠికలుసవరించు

  1. Söhnen, Renate. 1995. “On the Concept and Presentation of ‘yamaka’ in Early Indian Poetic Theory”. In: Bulletin of the School of Oriental and African Studies Vol. 58. No. 3 p 495–520.
  2. దండి. ఆంధ్ర దశకుమార చరితము.

మూలాలు, బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దండి_(కవి)&oldid=3190367" నుండి వెలికితీశారు