దక్షిణేశ్వర కాళికాలయం
దక్షిణేశ్వర కాళికాలయం (బెంగాలీ: দক্ষিনেশ্বর কালী মন্দির ) భారతదేశ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతా నగరమునందలి దక్షిణేశ్వరములో నెలకొనియున్న ఒక కాళికాలయం. హుగ్లీ నదియొక్క తూర్పు తీరమున నెలకొన్న ఈ కోవెలలో కాళికామ్మవారు భవతారిణి అను పేరుతో కొలువబడుదురు. భవతారిణి అనిన భవసాగరమును(సంసార సాగరమును) దాటించునని అర్థము.[1] ఈ ఆలయము 1855 లో రాణి రాస్మణి అనెడి సంపన్న భక్తురాలిచే నిర్మింపబడెను.[2] [3]
దక్షిణేశ్వర కాళికాలయం দক্ষিণেশ্বর কালী মন্দির | |
---|---|
భౌగోళికాంశాలు: | 22°39′18″N 88°21′28″E / 22.65500°N 88.35778°E |
పేరు | |
స్థానిక పేరు: | దక్షిణేశ్వర కాళికాలయము |
దేవనాగరి: | दक्षिणेश्वर काली मन्दिर |
Sanskrit transliteration: | दक्षिणेश्वर काली मन्दिर |
బెంగాలీ: | দক্ষিণেশ্বর কালী মন্দির |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | పశ్చిమ బెంగాల్ |
జిల్లా: | ఉత్తర 24 పరగణాలు |
ప్రదేశం: | కోల్‌కతా |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Bhavatarini Kali |
ప్రధాన పండుగలు: | Kali Puja, Snana Yatra, Kalpataru Day |
నిర్మాణ శైలి: | Bengal architecture |
ఆలయాల సంఖ్య: | 12:शिवलिंग(Shiv Lings) & 1:मुख्य मंदिर(Main Temple) |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 1855 |
నిర్మాత: | Rani Rashmoni |
వెబ్‌సైటు: | Official website |
చరిత్ర
మార్చుదక్షిణేశ్వర కాళికాలయం 19 వ శతాబ్ద మధ్య కాలంలో రాణీ రాష్మోనీ చే స్థాపించబడినది.[4] Rani Rashmoni belonged to Kaivarta caste[5] ఈ దేవాలయం ఆమె యొక్క దాతృత్వ కార్యకలాపాలతో ప్రసిద్ధమైంది. 1847 లో రాష్మోనీ తీర్థయాత్రల కొరకు కాశీ నగరం లో నెలకొనిఉన్న ఆదిపరాశక్తి ని దర్శించుటకు వెళ్ళడానికి నిశ్చయించుకుంది. రాణీ 24 పడవలలో ఆమె బంధువులు, సేవకులు, సామాగ్రి తో బయలుదేరింది.[6] సాంప్రదాయక ఆధారాల ప్రకారం ఆమె తీర్థయాత్రకు బయలుదేరిన ముందు రోజు రాత్రి కాళీ మాత అమె స్వప్నంలో కనబడి యిలా చెప్పింది. [7]
“ | బెనారస్ వెళ్ళవలసిన అవసరం లేదు. నా విగ్రహాన్ని గంగానదీ తీరంలో అందమైన దేవాలయంలో ప్రతిష్టించి అక్కడే పూజించండి. అచ్చట ప్రతిష్టించిన చిత్రంలో నుండి మీ ప్రార్థనలను స్వీకరిస్తాను. | ” |
స్వప్నం యొక్క ప్రభావంతో ఆమె వెంటనే దక్షిణేశ్వరం గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కొని 1847 నుండి 1855 వరకు అతి పెద్ద దేవాలయ సముదాయాన్ని నిర్మించింది. ఈ 20-ఎకరం (81,000 మీ2) స్థలాన్ని ఒక ఆంగ్లేయుడైన జాన్ హాస్టీ వద్ద కొన్నది. అప్పటికి ఈ స్థలం "సహేబాన్ బగీచా" గా ప్రసిద్ధమైనది.[8] అప్పటికి ఆ స్థలంలో ముస్లిం సమాధుల స్థలం తాబేలు ఆకారంలో ఉండెదిది. తంత్ర సంప్రదాయాల ప్రకారం శక్తి ఆరాధన యోగ్యమైనదిగా భావిస్తారు, కనుక ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఎనిమిది సంవత్సరాల కాలం, తొమ్మిది వందల వేల ధనం ఖర్చు అయినది. చివరికి మే 31 1855 న కాళీ మాత "స్నేహ యాత్ర" దినాన ఈ దేవాలయంలో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్సవాలలో ఈ దేవాలయం ప్రధానంగా "శ్రీ శ్రీ జగదీశ్వరి మహాకాళి" గా ప్రసిద్ధమైంది.[1][2][3][6][9] మే 31 1855 న ఒక లక్ష మంది కంటే ఎక్కువమండి బ్రాహ్మణులను విదిధ ప్రాతాలనుండి ఆహ్వానించడం జరిగినది. ఆ తర్వాతి సంవత్సరం ఆలయ ప్రధాన అర్చకుడు రామకుమార్ చటోపాధ్యాయ మరణించారు. ఆయన బాధ్యతలను ఆయన సోదరుడైన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువైన రామకృష్ణ పరమహంస , రామకృష్ణుని భార్య శారదా దేవి లకు అప్పగించబడినది. వారు ఆ దేవాలయం దక్షిణ భాగంలో గల "నహాబాత్" (సంగీత గది) లో ఉండేవారు. [10] ఆయన 1886 లో మరణించినంత వరకు గల 30 సంవత్సరాలు రామకృష్ణులవారు ఆలయ కీర్తి ప్రతిష్టలు పెంపొంచించే విధంగా విశేష కృషి చేసారు.[11]
దేవాలయం ప్రారంభోత్సవం జరిగిన ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే రాణీ రాష్మోనీ జీవించారు. ఆమె 1861 లో తీవ్ర అనారోగ్యపాలయ్యారు. ఆమె మరణించే ముందు ఆమె దీనాజ్ పట్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కలదు) లో కొంత ఆస్థిని కొని ఆలయ నిర్వాహణ కొరకు దేవాలయ ట్రస్టీకి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆమె ఫిబ్రవరి 18 1861 లో చేసి ఆ మరుసటి దినం స్వర్గస్తులైనారు.[2][6]
నిర్మాణకళ
మార్చుఈ దేవాలయం బెంగాలీ నిర్మాణ శైలిలో తొమ్మిది స్తంబాలు లేదా "నవ-రత్న" అనే సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. మూడు అంతస్తులు దక్షిణ ముఖ దేవాలయం తొమ్మిది స్థంబాలు పైన రెండు అంతస్తులలో విభజింపబడింది. ఇది ఎత్తుగా ఉన్న వేదికపై నిర్మించబడినది. ఇది 46 అడుగులు (14 మీ.) చదరాలు కొలత, 100 అడుగులు (30 మీ.) ఎత్తు కలిగిన మెట్ల నిర్మాణం కలిగి యున్నది.[3][6]
ఈ దేవాలయం గర్భగృహం లో ప్రధాన దేవత "కాళీమాత". ఈ దేవత స్థానికంగా "భవతరణి" గా పిలువబడుతుంది. ఈమె శివుని ఉదరంపై నిలబడినట్లు ఉంటుండి. ఈ రెండు విగ్రహాలు వేయి రేకుల వెండి కమలంపై ఉండేటట్లు నిర్మించబడినది. [3][6]
ప్రధాన ఆలయం దగ్గరగా పన్నెండు (12) ఒకేలా ఉన్న శివాలయాలు నిర్మిచబడినవి. అవి అన్నీ తూర్పు ముఖంగా "ఆట్ ఛాలా" అనే బెంగాలీ నిర్మాణ శైలిలో నిర్మితమైనవి. అవి అన్నీ హుగ్లీ నది యొక్క రెండు వైపులా ఉన్న తీరంలో నిర్మితమైనవి. ఈ దేవాలయ సముదాయ ఈశాన్యంలో విష్ణు దేవాలయం లేదా రాధా కాంత దేవాలయం నెలకొని యున్నది. మెట్ల వరుసలు వరండా, దేవాలయంలోనికి ఉన్నవి. ఇచట వెండి సింహాసనం పై 21+1⁄2-అంగుళం (550 mమీ.) కృష్ణుని విగ్రహం , 16-అంగుళం (410 mమీ.) రాధ విగ్రహం ఉన్నవి.[3][6]
యితర పఠనాలు
మార్చు- దక్షిణేశ్వర కాళికాలయం యొక్క వివరాలు Archived 2005-03-14 at the Wayback Machine శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం
చిత్రమాలిక
మార్చు-
"భవతరణి" గా కొలువబడుతున్న కాళీమాత.
-
రామకృష్ణ పరమహంస 1855 లో దేవాలయానికి వచ్చి, ఆలయ ప్రధానార్చకుడైన తన సోదరుడు రామకుమార్ కు సహకారం అందించారు. తరువాతి సంవత్సరం సోదరుని మరణం తరువాత ఆ భాద్యతలను స్వీకరించారు.
-
దక్షిణేశ్వర దేవాలయం యొక్క చిత్రం.
-
దక్షిణేశ్వర కాళీ దేవాలయం, ఎత్తుగా ఉన్న వేదికపై నిర్మాణం
నోట్సు
మార్చు- ↑ 1.0 1.1 Mehrotra 2008 p.11
- ↑ 2.0 2.1 2.2 "History of the temple". Dakshineswar Kali Temple. Retrieved 26 November 2012.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Dakshineswar - A Heritage". Government of West Bengal. Archived from the original on 2 సెప్టెంబరు 2013. Retrieved 26 November 2012.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Harding 1998, p.xii
- ↑ Sen, Amiya P. (June 2006). "Sri Ramakrishna, the Kathamrita and the Calcutta middle classes: an old problematic revisited". Postcolonial Studies. 9 (2): 165–177. doi:10.1080/13688790600657835.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 Swati Mitra (2011). Kolkata: City Guide. Goodearth Publications. Retrieved 26 November 2012.
- ↑ Rosen, Steven (2006). Essential Hinduism. Greenwood Publishing Group. pp. 201–202. ISBN 978-0-275-99006-0.
- ↑ Prabhananda 2003
- ↑ Swami Chetanananda (2001). God lived with them. Advaita Ashrama. Retrieved 26 November 2012.
- ↑ Mahendra Singh (1 Mar 2006). Dalit Inheritance In Hindu Religion. Gyan Publishing House. pp. 236–237. Retrieved 26 November 2012.
- ↑ Balakrishnan, S (May 9, 2003). "Kali Mandir of Kolkata". The Hindu. Archived from the original on 2003-06-30. Retrieved 2009-11-10.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
మూలాలు
మార్చు- Dutta, Krishna (2003). Calcutta: a cultural and literary history (illustrated ed.). Signal Books. p. 255. ISBN 978-1-902669-59-5.
- Prabhananda, Swami (October 2003). "The Kali Temple at Dakshineswar and Sri Ramakrishna". Vedanta Kesari.
- "Map of Kali Temple at Dakshineshwar". Archived from the original on 2008-06-12. Retrieved 2008-11-05.
- Harding, Elizabeth U. (1998). Kali: The Black Goddess of Dakshineswar. Motilal Banarsidass. ISBN 81-208-1450-9.
- Mehrotra, Rajiv (2008). Thakur: A Life Of Sri Ramakrishna. Penguin Books India. ISBN 0-14-306371-5.
ఇతర లింకులు
మార్చు- Dakshineswar Kali Temple, website
- Dakshineswar travel guide from Wikivoyage
- Dakshineswar.com - gives details about the origin and history of the temple
- Pilgrim shrine connected with Sri Ramakrishna
- Belur Math to Dakshineshwar Pilgrimage ( Video )
- Dakshineshwar Map with photos Archived 2010-04-06 at the Wayback Machine
- Dakshineshwar Domestic Area Durga Utsav