దత్తాత్రయ గజానన్ "దత్తు" ఫడ్కర్ (1925 డిసెంబరు 12 - 1985 మార్చి 17) టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ రౌండర్.

దత్తు ఫడ్కర్
డబ్ల్యు. జాన్సన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని హుక్ చేయబోయి, ఫడ్కర్ జారి పడిన దృశ్యం.
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దత్తాత్రేయ గజానన్ ఫడ్కర్
పుట్టిన తేదీ(1925-12-12)1925 డిసెంబరు 12
కొల్హాపూర్, మహారాష్ట్ర
మరణించిన తేదీ1985 మార్చి 17(1985-03-17) (వయసు 59)
చెన్నై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగు
  • కుడిచేతి ఫాస్ట్ మీడియం
  • కుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 41)1947 డిసెంబరు 12 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1958 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 31 133
చేసిన పరుగులు 1,229 5,377
బ్యాటింగు సగటు 32.24 36.08
100లు/50లు 2/8 8/29
అత్యధిక స్కోరు 123 217
వేసిన బంతులు 5,994 26,221
వికెట్లు 62 465
బౌలింగు సగటు 36.85 22.09
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 31
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 7/159 7/26
క్యాచ్‌లు/స్టంపింగులు 21/– 92/–
మూలం: ESPNcricinfo, 2013 10 January

ఫడ్కర్ అటాకింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేస్ బౌలర్. అతను బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే వాడు. వికెట్ నుండి బౌన్స్ పొందగలిగే వాడు. సాధారణంగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేవాడు. ప్రజల అభిమానం చూరగొన్న క్రికెట్ ఆటగాళ్ళలో అతను ఒకడు.

ఫడ్కర్ బొంబాయిలో రాబర్ట్ మనీ హైస్కూల్‌లో చదువుకున్నాడు. ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ నుండి BA పట్టా తీసుకున్నాడు. 10 సంవత్సరాల వయస్సులో, అతను ఇంటర్-స్కూల్ మ్యాచ్‌లో 156 పరుగులు చేశాడు. అతను 1941/42, 1946/47 మధ్య క్రికెట్‌లో బాంబే విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. తన కాలేజియేట్ అరంగేట్రంలో, అతను 274 పరుగులు చేశాడు. అది అప్పటి రికార్డు. అతను ఆల్ఫ్ గోవర్స్ క్రికెట్ స్కూల్‌లో శిక్షణ పొందాడు.

1947/48లో భారత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ఫడ్కర్, బంతి కంటే బ్యాట్‌తో మెరిశాడు. సిడ్నీలో కష్టతరమైన వికెట్‌పై అరంగేట్రం చేసిన అతను ఎనిమిదివ స్థానంలో బ్యాటింగుకు దిగి 51 పరుగులు చేశాడు. 14 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. నం.6కి ప్రమోటై, అతను అడిలైడ్‌లో 123 పరుగులు చేశాడు. విజయ్ హజారేతో కలిసి ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించాడు. ఫడ్కర్ బ్యాటింగ్ సగటులలో అగ్రస్థానంలో ఉండేవాడు. అతను ఆడిన నాలుగు టెస్టుల్లోనూ కనీసం యాభై పరుగులు చేశాడు.

తర్వాత సంవత్సరం మద్రాస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఫడ్కర్ 159 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు. ఇది టెస్టుల్లో అతని అత్యుత్తమ గణాంకాలు. కానీ ఈ మ్యాచ్‌లో అతను వేసిన బౌన్సర్‌లను వెస్టిండీస్ బౌలర్లు దీటుగా స్పందించడంతో భారత్ ఓటమి పాలైంది. భారత్‌కు 361 పరుగులు అవసరమైన చివరి టెస్టులో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫడ్కర్ 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అతని ఇతర ప్రధాన ఇన్నింగ్స్ 1951/52లో ఇంగ్లండ్‌పై 115 పరుగులు. 1952లో ఇంగ్లండ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయినప్పుడు, కాస్తో కూస్తో క్రెడిట్‌తో బయటపడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు. హెడింగ్లీలో భారత్ ఒక పరుగు చేసేలోపే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో ఫడ్కర్, హజారేలు ఆరో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.

ఫడ్కర్ 13 అనధికారిక టెస్టుల్లో ఆడాడు. అతను 1949/50, 1950/51 లలో పర్యాటక కామన్వెల్త్ జట్లతో మొత్తం పది టెస్టులు ఆడాడు. భారతదేశం నలుగురు కెప్టెన్లను ఉపయోగించిన 1949/50 సిరీస్‌లో, చివరి టెస్టులో ఫడ్కర్ జట్టును నడిపించాడు.

అతను 17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. 1950/51లో బాంబే కెప్టెన్‌గా కొనసాగాడు. 1948/49లో మహారాష్ట్రకు వ్యతిరేకంగా - మొత్తం 2376 పరుగులు చేసిన మ్యాచ్ అది - అతను 131, 160 కొట్టాడు. బౌలింగులో 3/142, 3/168 సాధించాడు. [1] అతని అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 1950/51లో బాంబే చేసిన 8 వికెట్లకు 725 మొత్తం స్కోరులో అతను 217 పరుగులు చేసాడు.[2] అతను నెల్సన్ తరపున లాంక్షైర్ లీగ్‌లోను, రోచ్‌డేల్ తరపున సెంట్రల్ లాంక్షైర్ లీగ్‌లోనూ ఆడాడు.

అతను 1970లలో జాతీయ సెలెక్టర్. MCC అతన్ని 1968లో జీవితకాల సభ్యునిగా చేసింది. అతను బొంబాయిలో టాటా & సన్స్‌లోను, రైల్వేలోనూ పనిచేశాడు.

పదవీ విరమణ తర్వాత అతను తన భార్యతో కలిసి కలకత్తాలోని బెహలాలో సన్నీ ప్రిపరేటరీ స్కూల్ అనే కిండర్ గార్టెన్ పాఠశాలను నడిపాడు. అతను మెదడు వ్యాధి కారణంగా మరణించాడు.

మూలాలు

మార్చు
  • క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్, టెస్ట్ క్రికెటర్లలో ది కంప్లీట్ హూ
  • భారత క్రికెట్ 1985 లో సంస్మరణ