దయా రామ్ సాహ్నీ
రాయ్ బహదూర్ దయా రామ్ సాహ్ని CIE (1879 డిసెంబరు 16 – 1939 మార్చి 7) 1920 - 1922 మధ్య హరప్పా వద్ద సింధు లోయ త్రవ్వకాలను పర్యవేక్షించిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త. జాన్ మార్షల్ శిష్యుడైన సాహ్ని 1931 లో భారత పురావస్తు సర్వే (ASI) డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. ఆ పదవిని చేపట్టిన మొదటి భారతీయుడతడు. 1935 వరకు అతడు ఆ హోదాలో ఉన్నాడు.
జననం | భేరా, పంజాబ్ (ఇప్ప్పుడు పాకిస్తాన్ పంజాబ్‌లో ఉంది) | 1879 డిసెంబరు 16
---|---|
మరణం | 1939 మార్చి 7 జైపూర్ | (వయసు 59)
ప్రాముఖ్యత | హరప్పా తవ్వకాలు |
ప్రారంభ జీవితం, విద్య
మార్చుదయా రామ్ సాహ్ని పంజాబ్ రాష్ట్రం, షాపూర్ జిల్లాలోని భేరా నగరంలో 1879 డిసెంబర్ 16 న జన్మించాడు. సాహ్ని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో బంగారు పతకంతో పట్టభద్రుడయ్యాడు. 1903 లో ఓరియంటల్ కాలేజీలో ఎంఏ చదివి పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయాల ఫలితంగా, సాహ్ని భారత పురావస్తు సర్వే స్పాన్సర్ చేసిన సంస్కృత స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నాడు. విద్య పూర్తి చేసిన తరువాత సంస్థలో నియామకం పొందాడు.
పురావస్తు శాస్త్రవేత్తగా
మార్చు1903 లో, సాహ్నిని పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్ సర్కిల్‌లో నియమించారు. అక్కడ అతను J. Ph. వోగెల్ ఆధ్వర్యంలో పనిచేశాడు. సాహ్ని 1905 లో కాసియాలో త్రవ్వకాలలో పాల్గొన్నాడు. 1906 జనవరి-ఫిబ్రవరి లో బీహార్ లోని రాజ్‌గిర్ వద్ద జాన్ మార్షల్ ఆధ్వర్యంలో తవ్వకాల్లో పాల్గొన్నాడు. 1907 సెప్టెంబరులో, చంపారన్ జిల్లాలోని రాంపూర్వ వద్ద స్థూపం తవ్వటానికి సాహ్ని మార్షల్‌కు సహాయం చేశాడు. సారనాథ్ వద్ద ఉన్న పురావస్తు శిధిలాల జాబితాను కూడా సిద్ధం చేశాడు.
1911 నుండి 1912 వరకు సాహ్ని లక్నో మ్యూజియం క్యూరేటర్‌గా పనిచేశాక, కాశ్మీర్ రాష్ట్ర పురావస్తు విభాగానికి బదిలీ అయ్యాడు. 1917 లో లాహోర్కు తిరిగి వచ్చాడు. యునైటెడ్ ప్రావిన్సెస్, పంజాబ్ లకు ఇన్‌ఛార్జిగా నియమితుడయ్యాడు. అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నప్పుడు, సింధు లోయ స్థలాల్లో మొట్టమొదటిదైన హరప్పా వద్ద సాహ్ని తవ్వకాలు జరిపాడు.[1]
1925 లో, సాహ్నిని పురావస్తు సర్వే సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఢిల్లీకి బదిలీ చేశారు. 1931 జూలైలో, అతను హర్గీవ్స్ తరువాత ASI డైరెక్టర్ జనరల్ గా నియమితుడయ్యాడు. ఈ పదవిలో నియమితుడైన మొదటి భారతీయుడు సాహ్ని.
1920 మార్చిలో రావల్పిండిలోని దర్బార్ వద్ద పంజాబ్ గవర్నరు, సాహ్నికి "రాయ్ బహదూర్" పతకాన్ని ప్రదానం చేశారు. 1935 లో ASI నుండి పదవీ విరమణ చేసిన వెంటనే, సాహ్నిని కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ తో సమ్మానించారు.
రచనలు
మార్చు- ఆర్కియలాజికల్ రెమెయిన్స్ అండ్ ఎక్స్కవేషన్స్ ఎట్ సంభార్
- ఎక్స్కవేషన్స్ ఎట్ బైరట్
మూలాలు
మార్చు- ↑ "Introduction | Harappa". www.harappa.com. Archived from the original on 2021-09-16. Retrieved 2021-09-16.
అంతకు ముందువారు హెరాల్డ్ హార్గీవ్స్ |
భారతీయ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ 1931-1935 |
తరువాత వారు జె.ఎఫ్.బ్లాకిస్టన్ |