దశార్ణ రాజ్యం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పురాతన మధ్య, పశ్చిమ భారతదేశంలో యాదవరాజులు పరిపాలించిన అనేక రాజ్యాలలో దాశార్ణరాజ్యం ఒకటి. ఇది ఉత్తర మధ్యప్రదేశు లోని చేది, పంచాల రాజ్యాలకు దక్షిణాన ఉంది. పంచాల యువరాజు శిఖండి దశార్ణకు చెందిన యువరాణిని వివాహం చేసుకున్నాడు. శిఖండిను 'మద్యమ-లింగంలో ఒకరు' అని సూచించబడింది. దీంతో దశార్ణరాజు, పాంచాలరాజు ద్రుపదుల మధ్య వివాదం ఏర్పడింది.
సివీలు, త్రిగర్తాలు, పశ్చిమ మాళవాలు, అమ్వాస్తాలతో పశ్చిమప్రాంతాలలో (పాకిస్తాను పంజాబు భూభాగాలలో) మరో దశార్ణరాజ్యం ఉంది. (2,31).
మహాభారతంలో మూలాలు
మార్చుభారతవర్షంలో దశార్ణ రాజ్యాలు
మార్చుభరత వర్ష (ప్రాచీన భారతదేశం) రాజ్యాల జాబితాలో దాశార్ణ కూడా జాబితా చేయబడింది.
వీరిలో కురు-పాంచాలలు, సాళ్వాలు, మాద్రేయులు, జంగళాలు, శూరసేనలు, కళింగులు, వోధలు, మాలాలు, మత్స్యలు, సావాల్యాలు, కుంతలులు, కాశీ-కోసలలు, చేదీలు, కరుషాలు, భోజులు, సింధులు, పులిందకులు, ఉత్తమాలు, దశార్ణలు, మేకలాలు, ఉత్కలాలు; పాంచాల, కౌసిజాలు ... ... (6,9)ఉన్నారు.
పాండవులు 13 వ సంవత్సరం ప్రవాసం గడపడానికి ఎంపిక చేసిన రాజ్యాలలో చేది ఒకటి.
కురుల రాజ్యం చుట్టూ పాంచాల, చేది, మత్స్య, శూరసేన, పట్టాచర, దశార్ణ, నవరాష్ట్ర, మల్లా, సాల్వ, యుగంధర, సౌరాష్ట్ర, అవంతి, విశాలమైన కుంతిరాజ్యాలు వంటి నాణ్యమైన మొక్కజొన్నలు పండించబడ్డాయని సూచించబడింది. (4,1)
ద్వైత వనం నుండి మత్స్యరాజ్యానికి పాండవుల ప్రయాణం
మార్చునివసిస్తున్న ద్వైతవనం వదిలి పాండవులు తూర్పు వైపున్న యమునా నది అనేక కొండలు, అడవుల గుండా పయనించారు. వారి అటవీ జీవితాన్ని ముగించి వారు దక్షిణ దిశలో ఉన్న యమునా దక్షిణతీరానికి చేరుకున్నారు. అడవి జింకలను వేటాడుతూ వారు యక్రిల్లోమా, శూరసేన మీదుగా వెళ్ళి తరువాత వారు పడమర వైపుకు తిరిగారి వారి వెనుక వారి కుడి వైపున పాంచాల దేశం, వారి ఎడమ దాశార్నాలు దాటి చివరికి వారు అడవిని విడిచిపెట్టి మత్స్య భూభాగంలోకి ప్రవేశించారు. అయినప్పటికీ వారికి విరాటనగరం ఇంకా దూరంగా ఉంది.
క్రింద ఉన్న భాగం వివిధ పురాతన రాజ్యాల స్థానాలను వివరిస్తుంది. పాంచాల రాజ్యానికి దశార్ణ పశ్చిమాన ఉందంబది అవాస్తవం చెప్పిందనే అస్పష్టమైన ఆలోచన ఉంది'
దశార్ణ రాజు సుదాముడు
మార్చుదశార్ణరాజు సుధర్ముడికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు చేదిరాజు విరబాహు (సుబాహు) ను వివాహం చేసుకున్నది. మరొకరు విదర్భరాజు భీముడిని వివాహం చేసుకున్నది. ప్రఖ్యాత యువరాణి దమయంతి ఈ విదర్భ రాజు భీముడి కుమార్తె. (3,69).
భీముడు దశార్ణ రాజు సుదాముడిని ఓడించుట
మార్చుపాండవరాజు యుధిష్ఠరుడు రాజసూయ యాగానికి కప్పం సేకరించే పోరాటసైన్యం దశార్ణ రాజ్యానికి చేరుకుంది.
భీముడు దాశార్ణులను లొంగదీసుకున్నాడు. అక్కడ దాశార్ణ దేశంలో సుధర్మ అనే రాజును భీమసేనుడు భీకర పోరాటం చేసాడు. భీమసేనుడు శార్ణరాజు చేసిన ఆ ఘనతను చూసి శక్తివంతమైన సుధర్ముడిని తన దళాలకు ప్రధానుడిగా నియమించాడు. (2,28)
పశ్చిమ దశార్ణాలను ఓడించిన నకులుడు
మార్చుపాండవరాజు యుధిష్ఠిరుడి రాజసూయ యాగానికి నివాళి సేకరించడానికి నకులుడు పశ్చిమ దశార్ణరాజ్యానికి చేరుకున్నారు.
పశ్చిమ ప్రాంతంలో నకులుడ్జూ దాశార్ణాలు, శివులు, త్రిగర్తలు, అమ్వాష్టాలు, మాళవులు, కర్ణాటాల ఐదు తెగలు, మధ్యమాకేయలు, వత్తాధనాలు అని పిలువబడే ద్విజులజాతికి చెందిన తరగతులను లొంగదీసుకున్నారు. (2,31)
దశార్ణరాజు హిరణ్యవర్మను
మార్చుపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న హిరణ్యవర్మను రాజుకు ఆయనకు ఒక అందమైన కుమార్తె ఉంది. పాంచాలరాజు ద్రుపదుడు ఈ దశార్ణ యువరాణిని తమ కుమారుడు శిఖండికి భార్యగా ఎన్నుకున్నాడు. శిఖండికి ఆడపిల్లగా జన్మించి కాని పురుషుడిగా పెరిగింది. శిఖండి నిజమైన లింగనిర్ధారణ గురించి రహస్యం బయటపడినప్పుడు దశార్ణ, పంచాలుల మధ్య యుద్ధం జరిగింది. పాంచాల రాజధానినగరం కాంపిల్యను (ఉత్తర ప్రదేశులోని కంపీలు) తొలగించాలని హిరణ్యవర్మను తన సైన్యాన్ని ఆదేశించాడు. (5-192,193). ద్రుపదచక్రవర్తి నగరం సహజంగా బాగా రక్షించబడింది. అయినప్పటికీ వారు దానిని మరింత జాగ్రత్తగా రక్షించడం, రక్షణాత్మక పనులతో బలపరచడం ప్రారంభించారు. (5,194)
శిఖండి చనిపోవాలని కోరుకున్నాడు, స్తునాకర్ణ అనే యక్ష అడవికి వెళ్ళాడు. ఆయన ఆ అడవిలోకి చొరబడిన వారిని చంపేస్తాడు. అడవి లోపల ఆయన భవనం ఎత్తైన గోడలు, ఒక ద్వారంతో, పొడి భూమితో పూతపూయబడింది. వేయించిన వరి సువాసనను కలిగి ఉన్న పొగతో సమృద్ధిగా ఉంది. ఆ భవనంలోకి ప్రవేశించిన శిఖండి చనిపోవడానికి ప్రాయోపవేసం చేసాడు. యక్షుడిదయతో, శిఖండిని మగవాడిగా మారాడు. అతను తన రాజ్యానికి తిరిగి వచ్చి దశార్ణాలు, పాంచాల మధ్య వివాదాన్ని ముగించాడు. (5-194,195)
హిరణ్యవర్మనౌ రాజును ద్రుపాద సోదరుడిగా పేర్కొన్నారు: - ద్రుపద మాటలు: - నా శక్తివంతమైన సోదరుడు, రాజు హిరణ్యవర్మను, ఒక పెద్ద శక్తిని సమీకరించి. కోపంతో నా వైపు వస్తున్నారు. (5,193)
కురుక్షేత్ర యుద్ధంలో దశార్ణులు
మార్చుపాండవ పక్షంలో
మార్చు- పాసవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో దాసర్ణ రాజు పాల్గొన్నాడు. (దసర్ణల పాలకుడు, ప్రయాగాలు, దసరాకులు, అనుపకులు, కిరాటాలతో) (6,50)
- చేదీ, వాసుదన పాలకులు, దాసర్ణ రాజు భీములను అనుసరించారు. (6,96)
- దాశార్ణ పాలకుడు ప్రాగ్జ్యోతిషా రాజు మీద దాడిచేసాడు (7,24)
కౌరవ పక్షంలో
మార్చు- కుక్షేత్రయుద్ధంలో కౌరవ సైన్యాధ్యక్షుడు ద్రోణుడిని ఇతర సైన్యాలు (కుంతలులు, మగధలు, విదర్భలు, మేలకాలు, కర్ణులు, ప్రవరణా అనుసరించారని సూచించబడింది.
దశార్ణరాజు చిత్రగుప్తుడు అర్జునుడి చేతిలో ఓడిపోవుట
మార్చుకురుక్షేత్ర యుద్ధం తరువాత అశ్వనేధయాగ నిర్వహణలో భాగంగా అర్జునుడు అశ్వన్ని వెంబడిస్తూ తన సైన్యంతో దశార్ణరాజ్యానికి చేరుకున్నాడు.
కాశీలు, అంగాలు, కోసలులు, కిరాతులు, తంగనాలను జయించిన తరువాత అర్జునుడు దశార్ణదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రజల పాలకుడు చిత్రంగదుడు. ఆయనకు అర్జునుడికి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు ఆయనను తన ఆధీనంలోకి తీసుకుని, నిషాధ రాజు (ఏకలవ్య కుమారుడు)రాజ్యానికి చేరుకుంది . (14,83)
క్రిష్ణ
మార్చు- వాసుదేవ కృష్ణుడి మాటలలో: (ఆయన పాండవుల పక్షంలో చేరినట్లైతే) దశారాలు, దశార్ణులు వారి సంబంధులు..... (5,140)అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చూడండి
మార్చుఈ బృందంలో ఇతర రాజ్యాలు:
- హైహయ రాజ్యం (నర్మదా నది లోయ)
- శురసేన (మథుర జిల్లా ఉత్తర ప్రదేశ్)
- చేది (ఝాంసీ, ఉత్తర ప్రదేశు)
- కరూష (in మద్యప్రదేశులో)
- కుంతీ ( మద్యప్రదేశు)
- అవంతి ( ఉజ్జయినిపరిసరాలలో)
- మాళవ (తూర్పు రాజస్థాను) (పశ్చిమ మాళ్వా నుండి వలసలు)
- గుజరాతు (దక్షిణ రాజస్థాను)
- అనర్త (ఉత్తర గుజరాతు)
- సౌరాష్ట్ర (దక్షిణ గుజరాతు)
- ద్వారక (సముద్రంలో గుజరాతు)
- విదర్భ (ఈశాన్య మహారాష్ట్ర)
మూలాలు
మార్చు- Mahabharata of Krishna Dwaipayana Vyasa, translated to English by Kisari Mohan Ganguli