దశావతారములు (1962 సినిమా)

ఇది ఒక డబ్బింగ్ సినిమా. కన్నడభాష నుండి అనువాదం చేయబడింది.

దశావతారములు
(1962 తెలుగు సినిమా)
Dasavataramulu 1962film.jpg
దర్శకత్వం బి.ఎస్.రంగా
నిర్మాణం యు.విశ్వేశ్వర రావు
తారాగణం రాజ్ కుమార్,
ఉదయ్ కుమార్,
రాజశ్రీ,
ఆదోని లక్ష్మి
సంగీతం పామర్తి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రామానుజాచార్య
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

  • రాజ్‌కుమార్
  • ఉదయ్‌కుమార్
  • రాజ్‌శంకర్
  • ఎ.వి.సుబ్బారావు
  • రాజశ్రీ
  • ఆదోని లక్ష్మి
  • లీలావతి
  • లక్ష్మీకాంతం
  • ఇంద్రాణి తదితరులు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: పి.జి.మోహన్
  • నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
  • మాటలు: సముద్రాల జూనియర్
  • పాటలు: సముద్రాల సీనియర్
  • సంగీతం: పామర్తి సుబ్బారావు
  • ఛాయాగ్రహణం: దొరైరాజ్
  • శబ్దగ్రహణం:ఎన్.శేషాద్రి
  • కళ:వాలి

కథసవరించు

శూన్యమయ జగత్తులో ఓంకారనాదం వినిపించడంతో మహావిష్ణువు బ్రహ్మను జగత్తును సృష్టించమని ఆదేశిస్తాడు.

బ్రహ్మ సూర్య, చంద్ర, నక్షత్రమండలాలను, భూగోళాన్ని, వాగ్దేవిని, సప్తఋషులను, సనకాదులను, దక్ష,నారదాది మునీంద్రులను సృజించి లోకపరిపాలనా భారాన్ని వారికి అప్పగిస్తాడు.

అధికార వ్యామోహితులైన దేవదానవులు పరస్పర ద్వేషంతో కక్ష సాధించుకుంటూ వుంటారు. దేవేంద్రుడు తరచుగా రాక్షసరాజు సోమకాసురునుండి తప్పించుకోవడానికి భృగుమహర్షి శరణుకోరి ఆశ్రమంలో తలదాల్చుకుంటాడు. అది తప్పు అని చెప్పి ఇంద్రుని భృగుపత్ని తృణీకరిస్తుంది. ఆమెకు నచ్చచెప్పడానికి యత్నించిన మహావిష్ణువును ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. జీవన్ముక్తురాలవు కమ్మని మహావిష్ణువు ఆమెను శపిస్తాడు. భృగు మహర్షి సతీవియోగం భరించలేక మహావిష్ణువును శపిస్తాడు. ఆ భృగుమహర్షి శాపఫలితంగా దశావతారాలను ఆయన ధరిస్తాడు.

వేద శిశువుల నపహరించిన సోమకాసురుని చంపి, తిరిగి గొనిరావడానికి మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరిస్తాడు. క్షీరసాగర మధనంలో అమృతాన్ని దేవదానవుల మధ్య పంచిపెట్టడానికి మోహిని అవతారాన్ని ధరిస్తాడు.

సనకసనందాదులచే శపించబడిన జయవిజయులు మూడు జన్మలు తనకు శతృవులుగా వుండి చివరకు ముక్తి పొందగలరని చెబుతాడు. అదే విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించిన వారిని వరాహ, నృసింహావతారాలు ధరించి వధిస్తాడు. తదుపరి వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధ, కలికావతారాలను ధరిస్తాడు[1].

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలను సముద్రాల రాఘవాచార్య రచించగా, పామర్తి సంగీత నిర్వహణలో ఘంటసాల, ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, పి.లీల, కె.అప్పారావు తదితరులు పాడారు.[2]

క్రమ సంఖ్య పాట పాడినవారు
1 రావే రాధికా కోపాలేలనే రంజిల్లు ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.జానకి బృందం
2 యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత (శ్లోకం) పి.బి.శ్రీనివాస్
3 గోదావరీ దేవి మౌనమేలనో తల్లి వైదేహి ఏమాయెనో కె.అప్పారావు
4 గత యుగాల మరిపించే వైఙ్ఞానిక యుగమిదీ ఘంటసాల బృందం
5 జీవకోటి బాధమాపి శాంతినీయ త్యాగమూర్తి ఘంటసాల బృందం
6 కృష్ణా మానసంరక్షకా మాధవా మధుసూధనా (పద్యం) ఎస్.జానకి
7 కన్నీరు మున్నీరుగా పౌరులా రామునడవికి పంపినారు ఘంటసాల
8 శృంగారమోహిని తెచ్చినది సొంపుగను బంగారు పి.లీల
9 రఘుపతి రాఘవ రాజారాముని నగుమొగ మెన్నడు ఎస్.జానకి
10 జయహే మాధవా సాదులోక పరిపాలన శీలా జయహే ఘంటసాల
11 ఒకటే పాత్రను పూలు ఇక ఒకటే దేవికి పూజా ఎస్.జానకి,
పి.లీల
12 అందాల కన్నయ్య నన్నేలు చిన్నయ్య ఎస్.జానకి

మూలాలుసవరించు

  1. రాధాకృష్ణ (4 May 1962). "చిత్ర సమీక్ష - దశావతారములు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 29 November 2020. Retrieved 23 February 2020.
  2. కొల్లూరి భాస్కరరావు. "దశావతారములు - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

మూస:IMDB title