యు.విశ్వేశ్వర రావు
యు. విశ్వేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. యు.విశ్వేశ్వరరావు 20 మే 2021న చెన్నై లో కరోనాతో మరణించాడు. [1][2][3]
విశేషాలుసవరించు
విశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. ఇతనికి మూడుసంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ ఇతనిని చేరదీశాడు. ఇతనికి 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. మొదట్లో ఇతడు మూడు సంవత్సరాల తరువాత చదువు ఆగిపోయింది. వ్యవసాయం చూసుకునే వాడు. ఇతని బావ దావులూరి రామచంద్రరావు ఇతడిని బాగా చదివించాలని నిర్ణయించాడు. ఫలితంగా ఇతడు తన 14వ యేటనుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదివి బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. తరువాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్ల సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అతనికి వింతగా అనిపించింది. సినిమా నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు గుడివాడ స్కూలులో ఇతని శిష్యులు. తరువాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపాడు. ఇతడికి విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. కాని అతని బావ ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టాడు.
మొదట ఇతడు పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశాడు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దానితో అతడు విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నాడు.
వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా అవతారం ఎత్తాడు.[4]
నందమూరి తారకరామారావు హీరోగా కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చంద్రుడు లాంటి హిట్ సినిమాలను ఆయన నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఎన్‌టిఆర్ తో వియ్యమందుకున్నాడు. ఎన్‌టిఆర్ కుమారుడు, సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణను, విశ్వేశ్వరరావు కూతురు శాంతితో వివాహం జరిగింది. మోహనకృష్ణ, శాంతి కుమారుడే యువ హీరో నందమూరి తారకరత్న.
సినిమాలుసవరించు
ఇతడు నిర్మించిన చిత్రాలు:
- ఎవరాస్త్రీ? (1966) (డబ్బింగ్ సినిమా)
- కంచుకోట (1967)
- నిలువు దోపిడి (1968)
- పెత్తందార్లు (1970)
- దేశోద్ధారకులు (1973)
ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలు:
- తీర్పు (1975)
- నగ్నసత్యం (1979)
- హరిశ్చెంద్రుడు (1981)
- కీర్తి కాంత కనకం (1983)
మూలాలుసవరించు
- ↑ 10TV (20 May 2021). "U. Visweswara Rao : నిర్మాత,దర్శకుడు. యు.విశ్వేశ్వరరావు కన్నుమూత | U. Visweswara Rao". 10TV (in telugu). Retrieved 20 May 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (20 May 2021). "నిర్మాత యు.విశ్వేశ్వరరావు మృతి!". www.andhrajyothy.com. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ Prajasakti (20 May 2021). "ప్రముఖ దర్శక నిర్మాత యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూత | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ సంపాదకుడు (1 October 1975). "దర్శకుడు - నిర్మాత యు.విశ్వేశ్వరరావు". విజయచిత్ర. 10 (4): 37–39.