దహేగాం మండలం

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం

దహేగాం మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]

దహేగాం
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, దహేగాం స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, దహేగాం స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, దహేగాం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°15′33″N 79°35′45″E / 19.259294°N 79.595718°E / 19.259294; 79.595718
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం దహేగాం
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,712
 - పురుషులు 17,131
 - స్త్రీలు 17,581
అక్షరాస్యత (2011)
 - మొత్తం 32.65%
 - పురుషులు 43.64%
 - స్త్రీలు 21.79%
పిన్‌కోడ్ 504273

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. ఈ మండలంలో 31   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

గణాంక వివరాలు

మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 34,712 - పురుషులు 17,131 - స్త్రీలు 17,581.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 283 చ.కి.మీ. కాగా, జనాభా 27,215. జనాభాలో పురుషులు 13,442 కాగా, స్త్రీల సంఖ్య 13,773. మండలంలో 6,835 గృహాలున్నాయి.[3]

ప్రభుత్వ కార్యాలయాలు

  • గ్రామ పంచాయతీ కార్యాలయం
  • మండల తహశీల్దార్ కార్యాలయం
  • ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం
  • పోలీస్ స్టేషన్
  • MPDO కార్యాలయం
  • ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం
  • పశు వైద్యశాల
  • చౌకధర పౌరసరఫరాల శాఖ
  • అంగన్వాడి సెంటర్
  • మండల ఐ.కె.పి. కార్యాలయం

వ్యవసాయం, పంటలు

మార్చు

దహెగాం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3639 హెక్టార్లు, రబీలో 8349 హెక్టార్లు. ప్రధాన పంటజొన్నలు. [4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామం ఒకటి (దబ్బగూడ) పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 163

వెలుపలి లంకెలు

మార్చు