దాగుడు మూతల దాంపత్యం

(దాగుడుమూతల దాంపత్యం నుండి దారిమార్పు చెందింది)

దాగుడు మూతల దాంపత్యం 1990లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, బోగవల్లి ప్రసాద్ శ్రీ విజయ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించగా, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, శారద, వాణి విశ్వనాథ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమోదైంది.[2]

దాగుడు మూతల దాంపత్యం
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం భోగవల్లి ప్రసాద్
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం అక్కినేణి నాగేశ్వరరావు,
రాజేంద్ర ప్రసాద్,
శారద,
వాణీ విశ్వనాథ్,
రమ్యకృష్ణ
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి బాలసుబ్రహమణ్యం,
మనో,
చిత్ర
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం శరత్
భాష తెలుగు

15 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆదర్శ దంపతులు రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావు), లలిత (శారద) పై ఈ చిత్రం ప్రారంభమవుతుంది. వారి సన్నిహిత మిత్రుడు గోపాలం (గుమ్మడి) తన కుమార్తె రేఖ (వాణి విశ్వనాథ్) గురించి బాధపడుతున్నాడని వారు తెలుసుకుంటారు. హైదరాబాదులో ఆమె బాబాయి మేజర్ నరసింహం (సత్యనారాయణ) వద్ద ఉంటూ, అతడు చేసిన గారాబం కారణంగా ఆమె తలపొగరుతో పెళ్ళి నిరాకరిస్తుంది. రాజశేఖరం, లలితలు హైదరాబాదు వెళ్ళి అవివాహితులుగా ఒక నాటకం ఆడతారు. లలిత గోపాలం సహాయంతో నరసింహమ్ ఇంట్లో చేరుతుంది. రాజశేఖరం వారి ఎదురింట్లో అద్దెకు దిగుతాడు. రేఖను నిశ్శబ్దంగా ప్రేమించే రిక్షావాల కిష్టయ్య (రాజేంద్ర ప్రసాద్) తో రాజశేఖరానికి పరిచయ మౌతుంది. రాజశేఖరం, లలితలు దానిని గ్రహించి, తాము ప్రేమికులుగా నటిస్తూ రేఖనూ అతన్నీ కలుపుతారు. ఇంతలో, రాధ (రమ్య కృష్ణ) తనను తాను రాజశేఖరం భార్యగా చెప్పుకుంటూ పూర్తి సాక్ష్యాలతో వస్తుంది. ఆ తరువాత, రాజశేఖరం ఆమె చెప్పేది తప్పని నిరూపించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తాడు కాని విఫలమవుతాడు. లలిత కూడా రాధను నమ్ముతుంది. సమాంతరంగా, రాజశేఖరానికి దగ్గరయ్యేందుకు రాధ కష్టపడుతుంటుంది. కాని అతడు ఆమెను తిరస్కరిస్తాడు. రాజశేఖరం ఆమె పట్ల ఆప్యాయత నటిస్తూ ఒక టూరుకు తీసుకువెళ్తాడు. అది తెలుసుకున్న లలిత, ఇక పట్టలేక తమ గురించిన నిజం చెప్పేస్తుంది. అయితే దాన్ని ఎవరూ నమ్మరు, ఆమెను పిచ్చిదిగా భావిస్తారు.

ఇంతలో, రాజశేఖరం రాధను మామూలుగా మారుస్తాడు. ఆశ్చర్యకరంగా ఆమె కిష్టయ్య అక్కేనని తెలుసుకుంటాడు. వెంటనే రాజశేఖరం గోపాలంతో కలిసి, వాస్తవాన్ని వెల్లడీంచి, కిష్టయ్య ఇలా ఎందుకు చేసాడో కారణం అడుగుతాడు. అప్పుడు అతను గతాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. రాధకు రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావే) అనే వ్యక్తితో పెళ్ళౌతుంది. అతడూ ఈ రాజశేఖరాన్నే పోలి ఉంటాడు. దురదృష్టవశాత్తు, రాధ భర్త ప్రమాదంలో మరణిస్తాడు. రాధ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున, ఆమెను రక్షించడానికి కిష్టయ్య ఈ చర్యకు పాల్పడతాడు. ఈ లోగా, లలిత ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. చివరికి, వారు ఆమెను కాపాడి, వాస్తవాన్ని చెబుతారు. చివరగా, కిష్టయ్య, రేఖల పెళ్ళితో ఈ చిత్రం సంతోషకరంగా ముగుస్తుంది.

నటీనటులు

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు

ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. పాటలు వేటూరి సుందరరామ మూర్తి రాశాడు. సూర్య మ్యూజిక్ కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.[3]

క్ర.సం. పాట గాయనీ గాయకులు నిడివి
1 మళ్ళీ యవ్వన ఎస్పీ బాలు, రమణి 3:57
2 గుసగుస ఎస్పీ బాలూ, చిత్ర 3:21
3 గొంతెమ్మ మనో, చిత్ర 4:16
4 మదిలోని మాట విని మనో, చిత్ర 4:19
5 ఓక మాట ఎస్పీ బాలూ, చిత్ర 4:20

మూలాలు

మార్చు
  1. "Dagudumuthala Dampathyam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-06-16. Retrieved 2020-08-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Dagudumuthala Dampathyam (Review)". Filmiclub.
  3. "Dagudumuthala Dampathyam (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-04.