అశోక్ కుమార్ (నటుడు)

అశోక్ కుమార్ ఒక ప్రముఖ నటుడు. పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా రాణించాడు.[1] ప్రజలు వీక్షించడానికి కేవలం దూరదర్శన్ చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు.

అశోక్ కుమార్
అశోక్ కుమార్
వృత్తినటుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

అశోక్ కుమార్ కు చిన్నప్పటి నుంచే నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. న్యాయవిద్యనభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టినా నటన మాత్రం ఆపలేదు. దూరదర్శన్ చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు. అశోక్ కుమార్ కు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేశారు, కుమారుడు సినిమాలలో నటన వృత్తిగా కొనసాగిస్తున్నాడు.

కెరీర్

మార్చు

టీవీలో ఆయన తెనాలి రామకృష్ణుడి మీద చేసిన కార్యక్రమాలతో ఆయనకు టీవీ నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అందులో తెనాలి రామకృష్ణుడిగా నటించాడు. ఇంకా భోజరాజు కథలు, భట్టి విక్రమార్క లాంటి ధారావాహికల్లో నటించాడు. బాపు దర్శకత్వం వహించిన శ్రీ భాగవతం ధారావాహికలో నారదుడిగా నటించాడు. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అవి పెద్దగా విజయవంతం కాలేదు. తరువాత టీవీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి సినిమాల్లో కేవలం సహాయ పాత్రలకు పరిమితం అయ్యాడు.

సూత్రధారులు సినిమాలో సీనియర్ నటి కె. ఆర్. విజయ భర్తగా సహాయ పాత్రలో నటించాడు. అలాగే వెంగమాంబ జీవిత చరిత్రలో వెంగమాంబను వ్యతిరేకించే దీక్షితులు అనే ఒక నెగటివ్ పాత్రలో నటించాడు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలతో ఆయనకు మంచి పరిచయం ఉండటం వల్ల ఆయన దర్శకత్వం వహించిన అనేక దూరదర్శన్ లఘుచిత్రాల్లో నటించాడు. అంతే కాక చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, అహ నా పెళ్ళంట, పెళ్ళి పుస్తకం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తాడు.[2]

 
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010) ముఖచిత్రం
 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సత్కారం అందుకున్న అశోక్ కుమార్

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. వై, సునీతా చౌదరి. "Ashok is grateful to television". thehindu.com. ది హిందూ. Retrieved 14 November 2016.
  2. "తెలుగు టివీ నటుడు అశోక్ కుమార్". nettv4u.com. Retrieved 14 November 2016.

బయటి లింకులు

మార్చు