దాడి వీరభద్రరావు
దాడి వీరభద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985 నుండి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
దాడి వీరభద్రరావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 2004 | |||
ముందు | రాజా కన్నబాబు | ||
---|---|---|---|
తరువాత | కొణతాల రామకృష్ణ | ||
నియోజకవర్గం | అనకాపల్లి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | దాడి జగ్గారావు | ||
సంతానం | రత్నాకర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితంసవరించు
దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి టిడిపి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. దాడి వీరభద్రరావు 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2013లో ఎమ్మోల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 2019 మార్చిలో తెలుగుదేశం పార్టీని విడి వైసీపీలో చేరాడు.[1][2]
ఎమ్మెల్యేగా పోటీసవరించు
సంవత్సరం | పేరు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2004 | అనకాపల్లి | కొణతాల రామకృష్ణ | కాంగ్రెస్ పార్టీ | 63277 | దాడి వీరభద్రరావు | తె.దే.పా | 46244 |
1999 | అనకాపల్లి | దాడి వీరభద్రరావు | తె.దే.పా | 52750 | కొణతాల రామకృష్ణ | కాంగ్రెస్ పార్టీ | 49039 |
1994 | అనకాపల్లి | దాడి వీరభద్రరావు | తె.దే.పా | 45577 | దంతులూరి దిలీప్ కుమార్ | స్వతంత్ర | 43966 |
1989 | అనకాపల్లి | దాడి వీరభద్రరావు | తె.దే.పా | 46287 | దంతులూరి దిలీప్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 44029 |
1985 | అనకాపల్లి | దాడి వీరభద్రరావు | తె.దే.పా | 51083 | నిమ్మదలా సత్యనారాయణ | కాంగ్రెస్ పార్టీ | 21542 |
మూలాలుసవరించు
- ↑ TV9 Telugu (9 March 2019). "వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు". Retrieved 3 June 2022.
- ↑ Andhra Jyothy (9 March 2019). "జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు". Archived from the original on 3 జూన్ 2022. Retrieved 3 June 2022.