అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం
అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°41′24″N 83°0′0″E |
చరిత్ర
మార్చుఅనకాపల్లి శాసనసభ నియోజక వర్గానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సి.పి.ఐ అభ్యర్థి కొడుగంటి గోవిందరావు ఎన్నికయ్యాడు. తర్వాత 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించడానికి మిగతా పార్టీలన్నీ జట్టు కట్టాయి. ఇందులో కృషికార్ లోక్ పార్టీ తరపున భీశెట్టి అప్పారావు ఎన్నికయ్యాడు. 1962, 1964 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున మళ్ళీ గోవిందరావు ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజక వర్గంలో కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి రాజా కన్నబాబు గెలుపొందాడు. తర్వాత జరిగిన పరిణామాలలో కన్నబాబు నాదెండ్ల వర్గంలో చేరడంతో అప్పట్లో ఏఎంఎల్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న దాడి వీరభద్రరావు సినీ నటుడు రావు గోపాలరావు మాటసాయంతో తెలుగుదేశం టికెట్ సాధించి వరసగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ విజయం సాధించగా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన జి.శ్రీనివాసరావు విజయం సాధించాడు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పీలా గోవింద సత్యనారాయణ గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున జి.అమర్నాథ్ గెలుపొందాడు.[1] 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై 65,764 ఓట్ల భారీ మెజారిటీతోతో గెలుపొందారు.
మండలాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 1955 - భీశెట్టి అప్పారావు
- 1972-పెంటకోట వెంకట రమణ
- 1952, 1978 - కొడుగంటి గోవిందరావు
- 1983 - రాజా కన్నబాబు
- 1985, 1989, 1994, 1999 - దాడి వీరభద్రరావు
- 2004 - కొణతాల రామకృష్ణ
- 2009 - జి.శ్రీనివాసరావు [2]
- 2014-పీలా గోవింద సత్యనారాయణ.[3]
- 2019- జి.అమర్నాథ్ [4]
- 2024 - కొణతాల రామకృష్ణ
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
శాసనసభ్యులు
మార్చుకాంగ్రెస్: అనకాపల్లి, నియోజకవర్గం, వయస్సు: 42 సం|| విద్య, మూడవ ఫారం కొంతకాలం జమ్‌షడ్‌పూర్ తాతా ఫాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష, ప్రత్యేక అభిమానం: కార్మికసంఘాలు, అడ్రస్సు: గవరపాలెం, అనకాపల్లి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "నాడు కమ్యూనిస్టులకు కంచుకోట.. నేడు తెదేపాకు పెట్టని కోట". EENADU. Retrieved 2024-03-26.
- ↑ "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-04.
- ↑ India (2022-09-29). "TDP launches relay hunger strike". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-04.
{{cite web}}
: Unknown parameter|స్త్రీirst=
ignored (help) - ↑ "Minister Amar Worried On Winning Chances Of Own Seat?". mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-29. Retrieved 2023-07-04.