అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°41′24″N 83°0′0″E మార్చు
పటం

చరిత్ర

మార్చు

అనకాపల్లి శాసనసభ నియోజక వర్గానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సి.పి.ఐ అభ్యర్థి కొడుగంటి గోవిందరావు ఎన్నికయ్యాడు. తర్వాత 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించడానికి మిగతా పార్టీలన్నీ జట్టు కట్టాయి. ఇందులో కృషికార్ లోక్ పార్టీ తరపున భీశెట్టి అప్పారావు ఎన్నికయ్యాడు. 1962, 1964 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున మళ్ళీ గోవిందరావు ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజక వర్గంలో కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి రాజా కన్నబాబు గెలుపొందాడు. తర్వాత జరిగిన పరిణామాలలో కన్నబాబు నాదెండ్ల వర్గంలో చేరడంతో అప్పట్లో ఏఎంఎల్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న దాడి వీరభద్రరావు సినీ నటుడు రావు గోపాలరావు మాటసాయంతో తెలుగుదేశం టికెట్ సాధించి వరసగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొణతాల రామకృష్ణ విజయం సాధించగా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన జి.శ్రీనివాసరావు విజయం సాధించాడు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పీలా గోవింద సత్యనారాయణ గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున జి.అమర్నాథ్ గెలుపొందాడు.[1] 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై 65,764 ఓట్ల భారీ మెజారిటీతోతో గెలుపొందారు.

మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1952 అనకాపల్లి కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 18505 విల్లూరి వెంకట రమణ కృషికార్ లోక్ పార్టీ 11866
బొడ్డేడ అచ్చన్నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 9797
1955 అనకాపల్లి భీశెట్టి అప్పారావు కృషికార్ లోక్ పార్టీ 19957 కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 19304
1962 అనకాపల్లి కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 23523 బుద్దా అప్పారావు నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 11786
1967 అనకాపల్లి కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 20539 బి.వి. నాయుడు స్వతంత్ర పార్టీ 12249
1972 అనకాపల్లి పెంటకోట వెంకట రమణ భారత జాతీయ కాంగ్రెస్ 29053 కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 22160
1978 అనకాపల్లి కొడుగంటి గోవిందరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 28382 పివి చలపతి రావు జనతా పార్టీ 19945
1983 అనకాపల్లి రాజా కన్నబాబు స్వతంత్ర అభ్యర్థి 40767 మల్ల లక్ష్మీ నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 15383
1985 అనకాపల్లి దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 51083 నిమ్మదల సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 21542
1989 అనకాపల్లి దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 46287 దంతులూరి దిలీప్ కుమార్ స్వతంత్ర అభ్యర్థి 44029
1994 అనకాపల్లి దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 45577 దంతులూరి దిలీప్ కుమార్ స్వతంత్ర అభ్యర్థి 43966
1999 అనకాపల్లి దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 52570 కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 49039
2004 అనకాపల్లి కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 63277 దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 46244
2009 అనకాపల్లి జి.శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ 58568 కొణతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 47702
దాడి వీరభద్రరావు తెలుగు దేశం పార్టీ 28528
2014 అనకాపల్లి పీలా గోవింద సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ 79911 కొణతాల రఘునాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 57570
2019 అనకాపల్లి జి.అమర్నాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 73207 పీలా గోవింద సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ 65038
2024 అనకాపల్లి కొణతాల రామకృష్ణ జనసేన 115,126 ఎం.భరత్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49,362

శాసనసభ్యులు

మార్చు

కాంగ్రెస్: అనకాపల్లి, నియోజకవర్గం, వయస్సు: 42 సం|| విద్య, మూడవ ఫారం కొంతకాలం జమ్‌షడ్‌పూర్ తాతా ఫాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష, ప్రత్యేక అభిమానం: కార్మికసంఘాలు, అడ్రస్సు: గవరపాలెం, అనకాపల్లి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "నాడు కమ్యూనిస్టులకు కంచుకోట.. నేడు తెదేపాకు పెట్టని కోట". EENADU. Retrieved 2024-03-26.
  2. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-04.
  3. India (2022-09-29). "TDP launches relay hunger strike". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-04. {{cite web}}: Unknown parameter |స్త్రీirst= ignored (help)
  4. "Minister Amar Worried On Winning Chances Of Own Seat?". mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-29. Retrieved 2023-07-04.