దాదా హయాత్ కలందర్

image skyline = Dattagiri.JPG దాదా హయాత్ ఖలందర్ లేదా బాబా బుడన్ : 11వ శతాబ్దానికి చెందిన సూఫీసంతు "అబ్దుల్ అజీజ్ మక్కీ" ఇతడి పూర్తి పేరు 'ఇతడి శిష్యగణాల్లో హిందువులు ముస్లిములు వుండేవారు. ఇతడి దర్గా కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు న గల బుడన్ గిరి (బుడన్ పర్వతాలు) Baba Budangiri, లో ఉంది. భారతదేశంలో కాఫీ మొక్కలను ప్రవేశపెట్టిన ఘనత ఇతడికే దక్కుతుంది. ఇతడు యెమన్ దేశంలోని మోచా (Mocha) ప్రాంతంనుండి కాఫీ మొక్కలను తీసుకు వచ్చి, బుడన్ గిరి ప్రాంతాలలో నాటాడు. ఆవిధంగా కాఫీ భారత్ కు పరిచయం అయ్యింది. ఇతడు భారత్ కు 1005 లో వచ్చాడు, మలబార్ తీరంద్వారా, చిక్కమగళూరుకు వచ్చి ఇక్కడే నివాసమేర్పరచుకున్నాడు. ఇతడు బాగ్దాదుకు చెందిన సూఫీ గురువు.

హిందువుల భావాలు మార్చు

దస్త్రం:Manikhyadhara.jpg
దాదాహయాత్ వద్ద గల మానిక్-ధారా జలపాతం.
 
మానిక్-ధారా లేదా మాణిక్యధార జలపాతం.

దాదాహయాత్, బాబాబుడన్ గా గుర్తించబడే అబ్దుల్ అజీజ్ మక్కీని, హిందువులు దత్తాత్రేయగా భావిస్తారు, ఈ బాబాబుడన్ గిరిని, దత్తగిరిగానూ గుర్తిస్తారు. ఇతడి దర్గా హిందూ-ముస్లిం పర్యాటకుల, భక్తుల కేంద్రం.

మూలాలు మార్చు

ఇతర పఠనాలు మార్చు

  • Pendergrast, Mark, Uncommon Grounds: The History of Coffee and How It Transformed Our World, (New York: Basic Book, 1999).