చిక్కమగళూరు
చిక్‌మగళూరు, అధికారికంగా చిక్కమగళూరు అని పిలుస్తారు.ఇది భారతదేశం కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లా లోని నగరం.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం. పశ్చిమ కనుమలలోని ముల్లయనగిరి శిఖరం దిగువన ఉన్న ఈ నగరం అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఉన్న కొండ ప్రాంతం. దీని వాతావరణం ఉష్ణమండల వర్షారణ్యాలు కలిగిఉంటుంది. కాఫీ తోటల కోసం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఇక్కడికి ఆకర్షిస్తుంది.
Chikmagalur | |
---|---|
City | |
Chikkamagaluru | |
Coordinates: 13°18′47″N 75°44′13″E / 13.313°N 75.737°E | |
Country | India |
State | Karnataka |
Founded by | King Rukmangada |
Government | |
• Body | City Municipality |
విస్తీర్ణం | |
• City | 32.7 కి.మీ2 (12.6 చ. మై) |
• Metro | 1,613 కి.మీ2 (623 చ. మై) |
Elevation | 1,090 మీ (3,580 అ.) |
జనాభా (2011)[1] | |
• City | 1,18,401 |
• జనసాంద్రత | 3,600/కి.మీ2 (9,400/చ. మై.) |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 577101 - 577102, 577133,577146 |
Vehicle registration | KA-18 |
భౌగోళికం
మార్చుచిక్కమగళూరు కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో పశ్చిమ కనుమల దిగువన దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1090 మీటర్లు (3,580 అడుగులు) ఎత్తులోఉంది. అంటే ఇది కర్ణాటకలో మూడవ ఎత్తైన నగరం. పట్టణం సమీపంలో యగచి నది దాని మూలాన్నికలిగి ఉంది.ఇది హేమవతి నదిలో కలిసేముందు ఆగ్నేయదిశలో ప్రవహిస్తుంది.
వాతావరణం
మార్చుచిక్కమగళూరు నగర వాతావరణంసాధారణంగా మధ్యస్థం నుండి చల్లని వాతావరణం కలిగి ఉంటుంది.శీతాకాలంలో ఉష్ణోగ్రత 11–20 °C (52–68 °F) వరకు ఉంటుంది. వేసవి కాలంలో 25–32 °C (77–90 °F) వరకు ఉంటుంది
వర్షపాతం
మార్చు2022లో, చిక్కమగళూరు హోబ్లీలో వార్షిక వర్షపాతం 1590 మి.మీ. (63 అంగుళాల) నమోదైంది. [2]
జనాభా శాస్త్రం
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, చిక్కమగళూరు నగరం మొత్తం జనాభా 1,18,401, అందులో 58,702 మంది పురుషులు కాగా, 59,699 మంది స్త్రీలు.పట్టణ జనాభా మొత్తంలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 11,633 మంది ఉన్నారు. చిక్‌మగళూరులో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 96,359, ఇది జనాభాలో 81.4% శాతం ఉంది. పురుషుల అక్షరాస్యత 83.7% శాతం ఉంది. స్త్రీల అక్షరాస్యత 79.1%శాతం ఉంది.. చిక్కమగళూరులో 7+ జనాభా ప్రభావవంతమైన అక్షరాస్యత రేటు 90.3% శాతం ఉంది.ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 93.1% శాతం ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 87.5%శాతం ఉంది. షెడ్యూల్డ్ కులాలు జనాభా 16,423 ఉండగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,734 మంది ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చిక్కమగళూరు పట్టణ పరిధిలో 28,545 గృహాలు ఉన్నాయి [1]
పర్యాటక ఆకర్షణలు
మార్చు- ముల్లయ్యన గిరి, దాని ప్రక్కనే ఉన్న శిఖరాలు
- అయ్యనకెరె సరస్సు
- భద్ర వన్యప్రాణుల అభయారణ్యం
- కుద్రేముఖ జాతీయ వనం
- భద్ర ఆనకట్ట
- హొరనాడు, శృంగేరి - యాత్రికుల ప్రదేశాలు
- యాగటి మల్లికార్జున దేవాలయం
- బేలూరు
- హళేబీడు
రవాణా
మార్చునగరంలో రైలు, రోడ్డు రెండు రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారి -173 (పూర్వం కె.ఎం రోడ్) 150 కి.మీ.దూరంలో ఉన్న ఓడరేవు పట్టణమైన మంగళూరుతో కలుపుతూ పట్టణం గుండా వెళుతుంది. రాష్ట్ర రహదారి 57 (కర్ణాటక) నగరాన్ని మైసూర్‌కి, దక్షిణాన హాసన్ మీదుగా,ఈశాన్య ప్రాంతంలోని కడూరు మీదుగా శివమొగ్గకు కలుపుతుంది. చిక్కమగళూరు రైల్వే స్టేషన్‌ని కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు రైలు మార్గం కలుపుతుంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Chikmagalur". www.censusindia.gov.in. Retrieved 27 November 2019.
- ↑ "Annual State Report 2022" (PDF). Retrieved 5 July 2023.[permanent dead link]
బాహ్య లింకులు
మార్చు- Chikmagalur travel guide from Wikivoyage
- Chickmagalur City Municipal Council Website