దామెర మండలం
దామెర మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
దామెర | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, దామెర మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | దామెర (దామెర మండలం) |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 506006 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు
లోగడ దామెర గ్రామం గ్రామం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను, ఆత్మకూరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దామెర గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ గ్రామీణ జిల్లా, వరంగల్ గ్రామీణ రెవిన్యూ డివిజను పరిధిలో, దామెర గ్రామంతో (1+12) పదమూడు గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నడికూడ మండలంలో చేరిన గ్రామాలుసవరించు
2016 పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన ఈ మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి.తరువాత ఈ గ్రామానికి చెందిన కంఠాత్మకూరు, కౌకొండ, సర్వాపూర్ అనే మూడు గ్రామాలు పరకాల రెవెన్యూ డివిజనుతోపాటు కొత్తగా ఏర్పడిన నడికూడ మండలం లో విలీనం చేసి, పరకాల రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది.[4]
మండలం లోని రెవెన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్". Zee News Telugu. 2018-03-24. Retrieved 2022-01-22.