నడికూడ మండలం
నడికూడ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం. పరకాల మండలం లోని 9 గ్రామాలను, దామెర మండలం లోని 3 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని 2018 ఆగస్టు 24 న ఏర్పరచారు. అప్పుడు ఈ కొత్త మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా ఉండేది. నడికూడ, ఈ మండలానికి కేంద్రం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ఉత్తరం వైపు 27 కి.మీ. దూరంలో ఉంది.
నడికూడ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, నడికూడ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°10′54″N 79°38′23″E / 18.181748°N 79.639796°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | నడికూడ |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 154 km² (59.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 32,116 |
- పురుషులు | 15,967 |
- స్త్రీలు | 16,149 |
పిన్‌కోడ్ | 506142 |
2021 లో వరంగల్ పట్టణ జిల్లాను హన్మకొండ జిల్లాగా పేరును మార్చిన సమయంలో దీన్ని వరంగల్ గ్రామీణ జిల్లా నుండి హన్మకొండ జిల్లా (పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా) లోకి మార్చారు. కొత్తగా ఏర్పడిన పరకాల రెవెన్యూ డివిజనులో భాగమైంది.[1][2][3] ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] నడికూడ పిన్ కోడ్ 506391.
2018 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 154 చ.కి.మీ. కాగా, జనాభా 32,116. జనాభాలో పురుషులు 15,967 కాగా, స్త్రీల సంఖ్య 16,149. మండలంలో 8,867 గృహాలున్నాయి.[5]
సమీప మండలాలు
మార్చునడికూడ మండలానికి తూర్పు వైపు శాయంపేట మండలం, పడమర వైపు కమలాపూర్ మండలం, ఉత్తరం వైపు మొగుళ్లపల్లి మండలం, దక్షిణాన ఆత్మకూరు మండలం ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- నార్లాపూర్
- నడికూడ
- వరికోల్
- రాయపర్తి
- పులిగిళ్ల
- చర్లపల్లి
- ముస్త్యాల్‌పల్లి
- చౌటపర్తి
- ధర్మారం
- సర్వాపూర్
- కౌకొండ
- కంఠాత్మకూర్
గమనిక: పరకాల మండలం నుండి మొదటి 9, దామెర మండలం నుండి చివరి 3 గ్రామాలతో ఈ మండలం ఏర్పడింది.
మూలాలు
మార్చు- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Hanamkonda, Warangal in Telangana to be new districts now- The New Indian Express". web.archive.org. 2021-10-03. Archived from the original on 2021-10-03. Retrieved 2021-10-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్". Zee News Telugu. 2018-03-24. Retrieved 2022-01-22.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.