దామోదర్ కుంద్ సరస్సు
దామోదర్ కుంద్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల జునాగడ్ సమీపంలోని గిర్నార్ కొండల ప్రాంతంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. ఈ సరస్సును హిందువులు పవిత్రమైన సరస్సుగా భావిస్తారు.[1][2]
దామోదర్ కుంద్ సరస్సు | |
---|---|
ప్రదేశం | గిర్నార్ పర్వతాలు, జునాగఢ్, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 21°31′32″N 70°29′10″E / 21.52556°N 70.48611°E |
సరస్సు రకం | కృత్రిమ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 257 అ. (78 మీ.) |
గరిష్ట వెడల్పు | 50 అ. (15 మీ.) |
ప్రాంతాలు | జునాగఢ్ |
ప్రత్యేకత
మార్చుహిందూ పురాణాల ప్రకారం ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది. మృతదేహాలను దహనం చేసిన తరువాత మిగిలిపోయిన బూడిద, ఎముకలను ఈ సరస్సులో వదలటానికి చాలా మంది హిందువులు ఇష్టపడతారు. ఈ సరస్సు లోని నీరు ఎముకలను కరిగించే లక్షణాలను కలిగి ఉంది.[3]
విస్తీర్ణం
మార్చుఈ సరస్సు 257 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు ఉంది. దీని చుట్టూ ఘాట్ నిర్మించారు.[4][2]
అభివృద్ధి
మార్చుగుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రక్షించిన స్మారక కట్టడాలలో దామోదర్ కుంద్ ఒకటి. ఇది చెక్-డ్యామ్ రిజర్వాయర్ ను కలిగి ఉంది. ఇక్కడ యాత్రికుల సౌకర్యం కోసం గదులు, పబ్లిక్ టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను గుజరాత్ ప్రభుత్వం కల్పించింది.[5]
మూలాలు
మార్చు- ↑ Folklore Notes - 2 Vols. (Vol. I - Gujarat, Vol. II - Konkan) By R.E. Enthoven. 1989.
- ↑ 2.0 2.1 Global Encyclopaedia of the Brahmana Ethnography edited by K.S. Krishna Rao. 2008. p. 177.
- ↑ Gazetteer , Volume 8, Bombay (India : State). Government Central Press, 1884. 1884. p. 442.
cremation.
- ↑ At the Three Rivers Archived 2013-08-23 at the Wayback Machine TIME, February 23, 1948.
- ↑ Census of India, 1961: Gujarat published by India. Office of the Registrar General, 1965, pp 818.