దాయపంతులపల్లి చెన్నదాసు

దాయపంతులపల్లి చెన్నదాసు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]

దాయపంతులపల్లి చెన్నదాసు
జననం1904
నవాబ్‌పేట మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ
మరణం1964
తండ్రినాగయ్య
తల్లినాగమ్మ

జీవిత విశేషాలు

మార్చు

చెన్నదాసు 1904లో యాదవ కుంటుంబానికి చెందిన నాగయ్య, నాగమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలంలో జన్మించాడు. ఈయన అనేక శాస్త్రాలు చదివాడు. కొంతకాలం తరువాత చదువు వదిలి కరణీకము రాసే పనిలో చేరాడు.

రచనా ప్రస్థానం

మార్చు

చిన్నప్పటినుండి భక్తిభావం కలిగివున్న చెన్నదాసు రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైనవి నేర్చుకొని పాడేవాడు. వేపూరు హనుమద్దాసు నుండి ఉపదేశము పొందాడు. గంగాపురం చెన్నకేశవ స్వామికి అంకితమిస్తూ అనేక కీర్తనలు రాసి, పాడాడు.[2]

ఈయన తన 60 ఏళ్ళ వయసులో 1964లో క్రోధనామ సంవత్సరం మార్గశీర్ష మాసము బహుళ పక్షము నవమి రోజున శతక పద్యములు వింటూ మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 17 November 2019.
  2. దాయపంతులపల్లి చెన్నదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 36