దావ వసంత సురేష్
దావ వసంత సురేష్ (జననం 1989 ఫిబ్రవరి 13) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. దావ వసంత[1][2] [3]జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో జన్మించింది. ఈమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది.
దావ వసంత | |
---|---|
జననం | 13 ఫిబ్రవరి, 1989 తిప్పన్నపేట, జగిత్యాల జిల్లా |
నివాస ప్రాంతం | జగిత్యాల పట్టణం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ పార్టీ | భారత రాష్ట్ర సమితి |
భార్య / భర్త | సురేష్ |
జననం, విద్యాభ్యాసం
మార్చువసంత నారాయణ, రాజమణి దంపతులకు 13, ఫిబ్రవరి, 1989లో జన్మించింది. వీళ్లది వ్యవసాయ కుటుంబం. స్వస్థలం జగిత్యాల జిల్లాలోని తిప్పన్నపేట గ్రామ పంచాయతీ గోపాల్‌రావు పేట. ఆమె ఆరవ తరగతి వరకు జడ్పీ ఉన్నత పాఠశాల - గోపాల్‌రావుపేట్‌లో చదువుకుంది. జగిత్యాలలోని శిశుమందిర్‌లో పదవ తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత ఇంటర్ విద్యను అభ్యసించడానికి వాణి జూనియర్ కాలేజీ - జగిత్యాలలో చేరింది. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందింది.
రాజకీయ జీవితం
మార్చురాజకీయాల్లోకి అడుపెట్టక ముందు దావ వసంత సాధారణ గృహిణి. 2019 జడ్పీటీసీ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఐదు వేల పై చిలుకు ఓట్లు సాధించి జగిత్యాల రూరల్ జడ్పీటీసీగా భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికయ్యింది. జడ్పీ ఛైర్ పర్సన్ రేస్‌లో ఎంతో మంది ఆశావహులు ఉన్నప్పటికీ.. రిజర్వేషన్, రాజకీయ సమీకరణాలు కలిసిరావడంతో బీఆర్‌ఎస్ అధిష్ఠానం దావ వసంత వైపు మొగ్గు చూపింది. దీంతో జిల్లా మొదటి జడ్పీ ఛైర్ పర్సన్‌గా ఎన్నికై రికార్డు నెలకొల్పింది. పాలిటిక్స్‌ను తొందరగా అవపోసన పట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అగ్ర రాజకీయ నాయకురాలిగా పేరొందింది.
వ్యక్తిగత విషయాలు
మార్చువసంత భర్త సురేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అక్కడ రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్ చదివి విద్యార్థి నాయకుడిగా రాణించాడు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్‌కు సన్నిహితుడు. ఆయన 2021 జూన్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అతను గతంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దావ వసంత, సురేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు.
ఇతర బాధ్యతలు
మార్చు- జీవ వైవిద్య కమిటీ జిల్లా అధ్యక్షురాలు
- జడ్పీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షురాలు
మూలాలు
మార్చు- ↑ Correspondent, Special (2019-06-08). "New zilla parishad chairpersons". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-02-08.
- ↑ "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Sakshi. 2019-06-08. Retrieved 2023-02-08.
- ↑ "Telangana Zilla Parishad Chairman Elections Live Updates - Sakshi". web.archive.org. 2022-01-28. Archived from the original on 2022-01-28. Retrieved 2023-02-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)