దాసరి వెంకట రమణ
తెలుగు రచయిత
దాసరి వెంకట రమణ బాల సాహిత్య రంగంలో సుపరిచితులు. అమ్మ మనసు, ఆనందం ఈయన ముఖ్య రచనలు. ఈయన చందమామ కథకులుగా ప్రసిద్ధులు.[1]
దాసరి వెంకట రమణ | |
---|---|
జననం | దాసరి వెంకట రమణ ఉయ్యాలవాడ గ్రామం, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | చందమామ కథల రచయిత, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత |
మతం | హిందూమతం |
భార్య / భర్త | లక్ష్మీదేవి |
పిల్లలు | శరత్‍చంద్ర, శ్రావణి |
తండ్రి | దాసరి రంగయ్య |
తల్లి | దాసరి వెంకటరమణమ్మ |
వ్యక్తిగత జీవితం
మార్చుఈయన స్వస్థలం కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామం. దాసరి వెంకటరమణమ్మ, దాసరి రంగయ్యలు ఈయన తల్లిదండ్రులు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో సబ్‍రిజిస్ట్రార్ గా పని చేస్తున్నారు. భార్య పేరు లక్ష్మీదేవి, కూతురు శ్రావణి, కొడుకు శరత్‍చంద్ర.
రచనలు
మార్చు- చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాల చంద్రిక, బాలమిత్ర, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, మొ॥ వార, మాస పత్రికలలో దాదాపు 200 కథలు
- దూరదర్శన్ లో 13 వారాల పాటు నడిచిన మహాకవి భారవి ధారావాహికకు కథ, మాటలు, పాటలు సమకూర్చారు.
పురస్కారాలు
మార్చు- భవిష్యత్తును రక్షించండి నవల ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ బహుమతి పొందింది.
- ఆనందం కథాసంపుటికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది.
మూలాలు
మార్చు- ↑ "పిల్లలకూ, పెద్దలకూ "ఆనందం" కలిగించే కథలు". Archived from the original on 10 జూలై 2016. Retrieved 6 June 2017.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
బయటి లంకెలు
మార్చు- కహానియా డాట్ కామ్ వద్ద రచయిత పేజీ
- కినిగె లో రచయిత పేజీ Archived 2017-05-10 at the Wayback Machine