దాసు త్రివిక్రమరావు

దాసు త్రివిక్రమరావు (1894 - 1950) గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తి.

దాసు త్రివిక్రమరావు
Trivikramarao.jpg
దాసు త్రివిక్రమరావు
జననం(1894-09-06)1894 సెప్టెంబరు 6
India కొండముది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1960 జూలై 31(1960-07-31) (వయస్సు 65)
ప్రసిద్ధిన్యాయవాది, కార్మికనేత, గ్రంథాలయోద్యమనేత
మతంహిందూ
భార్య / భర్తవరలక్ష్మి
తండ్రిదాసు కేశవరావు
తల్లిసరస్వతమ్మ

బాల్యం విద్యాభ్యాసంసవరించు

వీరు విజయవాడలో జన్మించి, విద్యాభ్యాసం చేసిన పిదప చెన్నై చేరారు. 1920 లో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టరు పూర్తిచేశారు.

గ్రంథాలయోద్యమంలోసవరించు

విజయవాడలోని రామమోహన గ్రంథాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 1934లో చెన్నైలో జరిగిన 19వ రాష్ట్ర గ్రంథాలయ మహాసభలకు అధ్యక్షత వహించారు. విజయవాడ కేంద్రంగా పనిచేసిన అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘానికి 1919 నుండి సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఆ సంఘం ముద్రించిన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అను ఆంగ్ల పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. 1928లో గ్రేట్ బ్రిటన్ లో జరిగిన ఆ దేశపు గ్రంథాలయ మహాసభకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు.[1]

1933లో తిరుచిరాపల్లిలో జరిగిన ప్రథమ తమిళనాడు రూరల్ లైబ్రరీ సర్వీస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అదే సంవత్సరం కొల్కతా లో జరిగిన ఇండియన్ లైబ్రరీ కాన్ఫరెన్స్ కు హాజరై ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "దాసు త్రివిక్రమరావు". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.