దిట్టకవి శ్రీనివాసాచార్యులు

దిట్టకవి శ్రీనివాసాచార్యులు ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రఖ్యాత రచయిత, అవధాని.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1946, జూలై 1వ తేదీన ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం అనే గ్రామంలో జన్మించాడు. రాఘవమ్మ, నంద్యాల రాఘవాచార్యులు ఇతని జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాగా దిట్టకవి నరసింహాచార్యులు, సుబ్బమ్మ ఇతడిని దత్తత తీసుకున్నారు. ఇతని ప్రాథమిక విద్య, హైస్కూలు విద్య యర్రగొండపాలంలో గడిచింది. 1963లో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసిన తరువాత కృష్ణాజిల్లా చిట్టిగూడూరులోని శ్రీనారసింహ సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ, కర్నూలులో పండితశిక్షణ చదివాడు. అ తరువాత ప్రైవేటుగా చదివి పి.ఓ.ఎల్., ఎం.ఎ.డిగ్రీలను పొందాడు. ఇతడు ఏనుగులదిన్నెపాడు, కొమరోలు లలో రెండవ గ్రేడు తెలుగు పండితుడిగా, మర్రిపూడి, త్రిపురాంతకం, ఈతముక్కల, నాయుడుపాలెం, మేడిపి తదితర ప్రాంతాలలో మొదటి గ్రేడు తెలుగు పండితునిగా, మాచర్లలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేసి 2004లో పదవీవిరమణ చేశాడు.

మూలాలు మార్చు