దిలావర్‌ మహ్మద్‌ ఖమ్మం జిల్లాకు చెందిన కథా రచయిత. ఇతని రచన తొలిసారిగా 1969 ఆంధ్రజ్యోతిలో 'నవ్వులు' కవిత ప్రచురితమైంది. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితం. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కలగడానికి ప్రధానంగా కౌముది (షంషుద్దీన్‌), ఆవంత్స సోమసుందర్ కారణం కాగా శ్రీశ్రీ, తిలక్‌లు పరోక్షంగా ప్రేరణ అని చెప్పుకుంటారు .

బాల్యము

మార్చు

దిలావర్‌ మహ్మద్‌ డాక్టర్‌: ఖమ్మం జిల్లా ఇల్లెందు తాలూక పాత కమలాపురంలో 1942 జూన్ 5న జన్మించారు. కలం పేరు : దిలావర్‌. తల్లితండ్రులు: మహబూబ్బి, మహ్మద్‌ నిజాముద్దీన్‌. చదువు: ఎంఏ., బి.ఇడి., పి.హెచ్‌డి. ఉద్యోగం: అధ్యాపకులుగా 2000లో విరమణ పొందారు.

రచనా వ్యాసంగము

మార్చు

ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ మ్యాగ్ జైన్‌ 'ప్రగతి' కోసం 'తాజ్‌ మహాల్‌' కథ రాయడం ఆ తరువాత పదవ తరగతిలో 'ఆకలి' కథానిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం అయ్యింది. . తొలిసారిగా 1969 ఆంధ్రజ్యోతిలో 'నవ్వులు' కవిత ప్రచురితమైంది. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కలగడానికి ప్రధానంగా కౌముది (షంషుద్దీన్‌), ఆవంత్స సోమసుందరం కారణం కాగా శ్రీశ్రీ, తిలక్‌ పరోక్షంగా ప్రేరణ. అమెరికా తదితర దేశాలను పర్యటించిన సందర్భంగా దేశాల సాహిత్యంతో ఏర్పడిన పరిచయం దృష్ట్యా 20 దేశాలకు చెందిన సాహిత్య గ్రంథాలను సమీక్షిస్తూ రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో చోటు చేసుకున్నాయి.

రచనలు

మార్చు
1.వెలుగు పూలు (1974), 2. వెన్నెల కుప్పలు (1980), 3.జీవన తీరాలు (1988), 4.కర్బలా (1999), 5.రేష్మా ... ఓ రేష్మా (కవితా సంపుటాలు, 2003), 6. గ్రౌండ్‌జీరో (దీర్ఘ… కవిత, 2003), 7. మచ్చు బొమ్మ (కదలసంపుటి, 2008), 8. ప్రణయాంజలి (పద్యకావ్యం,2001), 9.ప్రహ్లాదచరిత్ర-ఎఱ్రన- పోతన : తులనాత్మక పరిశీలన (1989), 11. లోకావలోకనం (సాహిత్యసమీక్షా వ్యాసాలు, 2010). 

నవలలు

మార్చు

1.సమిధలు (భారతి, 1985), 2.ముగింపు (కథాకళి, 1996), 3.తుషార గీతిక (జయశ్రీ, 1981) మొదలగునవి ప్రచురితమయ్యాయి. వీరు ప్రజా సంఘాలు, సాహితీ సంస్థల ద్వారా సన్మానాలు పొందారు.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.

బాహ్య లంకెలు

మార్చు
  1. అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 62