దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఈమె కృష్ణ కూతురుగా నటించింది. తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రదర్శకుడు ద్వారకేష్ ఈమె పేరును దివ్యవాణిగా మార్చాడు.

దివ్యవాణి
Divyavani Actress.jpeg
జననంగుంటూరు జిల్లా తెనాలి
చదువు10వ తరగతి
వృత్తితెలుగు సినిమానటి
క్రియాశీలక సంవత్సరాలు1987-2018
పేరుతెచ్చినవిపెళ్ళి పుస్తకం,
మొగుడు పెళ్ళాల దొంగాట
జీవిత భాగస్వామిదేవానంద్
పిల్లలుకిరణ్ కాంత్,
తరుణ్యాదేవి
తల్లిదండ్రులుఆదినారాయణరావు,
విజయలక్ష్మి

జీవిత విశేషాలుసవరించు

ఈమె స్వగ్రామం తెనాలి. ఈమె తండ్రి ఆదినారాయణరావు, తల్లి విజయలక్ష్మి[1]. ఈమె గుంటూరులో పదవ తరగతి వరకు చదువుకుంది.ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి బేబీ రాణి నృత్యకళాకారిణి. చిన్నవయసులోనే అంటే 17యేళ్ళ వయసులోనే ఈమెకు దేవానంద్ అనే పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. వీరికి కిరణ్ కాంత్ అనే కుమారుడు, తరుణ్యాదేవి అనే కుమార్తె కలిగారు. దివ్యవాణి భర్త యుక్తవయసులోనే మరణించాడు.

ఈమె సుమారు 40 తెలుగు సినిమాలలో నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించింది. వీర మొదలైన సినిమాలలో దుష్టపాత్రలలో నటించింది. ఈమె పుత్తడిబొమ్మ (ఈటీవి తెలుగు) వంటి కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది[2].

దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. వందన శేషగిరిరావు. "దివ్య వాణి , Divyavani". Tollywood Photo Profiles. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 11 June 2020. Check date values in: |archive-date= (help)
  2. వెబ్ మాస్టర్. "Divya Vani". nettv4u. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 11 June 2020. Check date values in: |archive-date= (help)

బయటిలింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దివ్యవాణి&oldid=2965328" నుండి వెలికితీశారు