దివ్యా దేశ్‌ముఖ్
దివ్యా దేశ్‌ముఖ్ (జననం 2005 డిసెంబరు 9) ఒక భారతీయ చెస్ క్రీడాకారిణి, ఆమె ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) బిరుదును కలిగి ఉంది.[3][4]
దివ్యా దేశ్‌ముఖ్ | |
---|---|
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | [1] నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం | 2005 డిసెంబరు 9
టైటిల్ | ఇంటర్నేషనల్ మాస్టర్ (2023) ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (2021) |
అత్యున్నత రేటింగ్ | 2456 (జూన్ 2024)[2] |
కెరీర్
మార్చుఆమె 2022 మహిళల భారత చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఆమె 2022 చెస్ ఒలింపియాడ్ వ్యక్తిగత కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఆమె బంగారు పతకం గెలుచుకున్న FIDE ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ 2020 జట్టులో కూడా భాగంగా ఉంది.[5] సెప్టెంబరు 2023 నాటికి, ఆమె భారతదేశంలో 7వ ర్యాంక్ మహిళా చెస్ క్రీడాకారిణి.[6]
అల్మాటీ, కజకస్తాన్ లో ఆమె 2023 ఆసియా మహిళల చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది.[7] ఆ తర్వాత ఆమె టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్ మహిళల ర్యాపిడ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్లో, ఆమె హారిక ద్రోణవల్లి, వంతిక అగర్వాల్, కోనేరు హంపి, సవిత శ్రీ బి, ఇరినా క్రుష్, నినో బత్సియాష్విలి ఓడించి, మహిళల ప్రపంచ ఛాంపియన్ జు వెంజున్, అన్నా ఉషేనినా డ్రా చేసుకుంది,, ఆమె పోలినా షువలోవా చేతిలో మాత్రమే ఓడిపోయింది.[8]
జూన్ 13,24న, ఆమె 2024 ఫిడే వరల్డ్ U20 గర్ల్స్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది.
మూలాలు
మార్చు- ↑ "Divya Deshmukh". Twitter. Retrieved 6 May 2022.
- ↑ "Divya Deshmukh FIDE profile". Retrieved 8 December 2020.
- ↑ Navalgund, Niranjan (5 March 2022). "Arjun Erigaisi, Divya Deshmukh Clinch Indian National Championships". chess.com. Retrieved 10 July 2022.
- ↑ Ahmed, Shahid (19 October 2021). "Divya Deshmukh becomes the 22nd Woman Grandmaster of India". Chessbase India. Retrieved 27 February 2022.
Divya Deshmukh scored her final WGM-norm in her first tournament in over 17 months at First Saturday GM October 2021.
- ↑ "India – FIDE Online Olympiad 2020". FIDE Online Olympiad 2020 / 24 July - August 30. Archived from the original on 18 నవంబరు 2022. Retrieved 27 February 2022.
- ↑ "FIDE Ratings". Retrieved 2 September 2023.
- ↑ Asian Continental Women Chess Championship 2023
- ↑ TATA STEEL CHESS INDIA RAPID 2023 (WOMEN)