దివ్య యనమాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తుని నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1]

దివ్య యనమాల

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు దాడిశెట్టి రాజా
నియోజకవర్గం తుని

వ్యక్తిగత వివరాలు

జననం 1984
ఎ.వి. నగరం గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు యనమల రామకృష్ణుడు
జీవిత భాగస్వామి చావాలి వెంకట గోపినాథ్
నివాసం ఎ.వి. నగరం గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం

మార్చు

దివ్య 1984లో యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె హైదరాబాద్‌లోని 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, 2012లో ఎంబీఏ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

యనమాల దివ్య తన తండ్రి యనమల రామకృష్ణుడు అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 ఫిబ్రవరిలో తుని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమితురాలైంది. ఆమె నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. 'మీ ఇంటికి మీ దివ్య: 'ఇంటింటికీ తెలుగుదేశం' 'సూపర్ సిక్స్' పథకాలంటూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఆమె వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కూటమి అధికారంలోకి వచ్చాక అందించే సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పేరుతో  చేపట్టిన కార్యక్రమం తొండంగి, తుని మండలం, పట్టణం మీదుగా సాగగా, రాజుల కొత్తూరు వద్ద 3,200 కిలోమీటర్లు మైలు రాయి పైలాన్ ను ఆమె ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.

ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తుని నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై 15177 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2][3][4]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tuni". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  3. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. BBC News తెలుగు (8 May 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.