ది హన్స్ ఇండియా ఒక ఇంగ్లీష్ దినపత్రిక. 2011 జూలై 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటూ, విశాఖపట్టణం, విజయవాడ, వరంగల్, తిరుపతిలలో దీనికి ఎడిషన్‌లు ఉన్నాయి. హెచ్ ఎం టివి వ్యవస్థాపక ప్రధాన సంపాదకులు కె రామచంద్రమూర్తి దీనికి కూడా వ్యవస్థాపక ప్రధాన సంపాదకులు. ప్రస్తుతం కె.నాగేశ్వర్ ఈ పత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు. ది హన్స్ ఇండియా, హెచ్ ఎమ్ టివి లను హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది. కపిల్ గ్రూప్ యజమాని కె వామన రావు దీనికి అధ్యక్షులు. దేశ వ్యాప్తంగా ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు ఇందులు వ్యాసాలు రాస్తున్నారు.

బయటి లింకులుసవరించు