హెచ్ ఎమ్ టివి
హెచ్ ఎం టీవి తెలుగులో ఒక ప్రధాన 24 గంటల వార్తా ఛానల్. హైదరాబాద్ మీడియా హౌజ్ అనే సంస్థ దీనిని ప్రమోట్ చేస్తోంది. గతంలో ఎన్నో పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన, ప్రముఖ తెలుగు పాత్రికేయులు కె రామచంద్రమూర్తి దీనికి ప్రధాన సంపాదకులు.
హెచ్ ఎమ్ టివి | |
---|---|
హైదరాబాదులోని హెచ్‍ఎంటీవీ కార్యాలయం | |
ఆవిర్భావము | 12 ఫిబ్రవరి 2009 |
Network | హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్ |
నినాదము | వేగం... తేజం... |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు, ఉర్దు, ఇంగ్లీష్ |
Affiliates | ది హన్స్ ఇండియా |
ప్రధాన కార్యాలయం | హైదరాబాదు |
వెబ్సైటు | http://www.hmtvlive.com/ |
తెలుగుతో పాటూ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో రెండు వార్తా బులిటెన్లు ఈ ఛానల్‌లో ప్రసారం అవుతాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ఈ ఛానల్ నిర్వహించిన దశ దిశ కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
మిగిలిన తెలుగు ఛానళ్ల వలె బ్రేకింగ్ అంటూ ప్రాధాన్యత లేని వార్తలను, లేదా చిన్న అంశానికి అనసవర హైప్ క్రియేట్ చేయడం వంటి టిఆర్‌పి ట్రిక్కులకు హెచ్ ఎం టివి దూరం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో ప్రజలకు అవసరం లేని పార్శ్వాలను కూడా ఈ ఛానల్ స్పృశించదు. క్రైమ్‌ను కేవలం వార్తలుగానే చూపిస్తుంది తప్ప నేర కథనాలను పాత్రలతో చిత్రీకరించి ప్రసారం చేయడం వంటి పనులు చేయదు. ప్రాంతీయ, కుల, మత, వర్గ, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వంతంగా పనిచేసే చానల్.[ఆధారం చూపాలి]
ప్రారంభ చరిత్ర
మార్చుఈ ఛానల్ వ్యవస్థాపకులలో ప్రముఖ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఒకరు.
కొన్ని విభాగాలు
మార్చు- న్యూస్ రూం
- స్టూడియో
- స్క్రోలింగ్
- వాయిస్ ఓవర్
- పీసీఆర్
- ఎంసీఆర్
- కార్ రూం
- లైబ్రరీ
ఇతర విశేషాలు
మార్చు- హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2011 జూలై 15 న ది హన్స్ ఇండియా అనే ఇంగ్లీష్ దిన పత్రికను ప్రారంభించారు.