దీర్ఘాసి విజయభాస్కర్

నాటక రచయిత, కవి, అనువాదకుడు

డా. దీర్ఘాసి విజయభాస్కర్ నాటక రచయితగా, కవిగా, కథకుడిగా, అనువాద రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకరంగానికి సంబంధించిన పరిశోధనలో మంచి పేరు సంపాదించిన రచయిత. [1]

దీర్ఘాసి విజయభాస్కర్
Vizai Bhaskar Deerghasi.jpg
జననందీర్ఘాసి విజయ భాస్కర్
(1958-07-31)1958 జూలై 31
అంపోలు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
వృత్తిరచయిత, ప్రభుత్వ అధికారి, నాటక రచయిత, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు (Re)
ప్రసిద్ధినాటకరంగ పరిశోధకుడు, రచయిత, కవి
మతంహిందూ
భార్య / భర్తశ్రీమతి గౌరీదేవి
పిల్లలు3 కుమార్తెలు :
 1. ‌ దివ్య
 2. ‌ భవ్య
 3. ‌ చైతన్య
తండ్రిసూర్యనారాయణ
తల్లివరాలమ్మ

జననం, విద్యాభ్యాసంసవరించు

విజయభాస్కర్ శ్రీకాకుళం జిల్లా అంపోలులో 1958 జులై 31న జన్మించాడు. తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి పేరు వరాలమ్మ. అంపోలు గ్రామంలో ప్రాధమికవిద్య, శ్రీ కూర్మం లో హైస్కూల్ విద్యని అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో ఎం,ఎ ఇంగ్లిష్ లిటరేచర్ ఆంధ్రా యూనివర్సిటిలో చదివారు. డిగ్రీలోనే మొట్టమొదటి నాటిక "తూర్పు తెల్లారింది" రచించారు నాటకరంగంపై ఉన్న మక్కువతో బెర్టోల్ట్ బ్రెఖ్ట్ కావ్య నాటిక " రాగం - తెలుగు నాటిక సాహిత్యంపై ప్రభావం " అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు.

ఉద్యోగంసవరించు

ఇంగ్లిష్ లెక్చరర్ గా చింతపల్లిలో 1985వ సంవత్సరంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంబించి అక్కడ ఉన్న గిరిజన విద్యార్దుల తల్లితండ్రుల మన్నన పొందారు.గ్రూప్స్ లో ఉత్తిర్ణత పొంది మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు 1991 లో మొట్టమొదట రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గా, అనంతపురం జిల్లాలోని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గా, కర్నూల్ జిల్లా బిసి కార్పొరేషన్ డైరెక్టర్ గా, ఎస్సి కార్పొరేషన్ ఇన్చార్జ్ డైరెక్టర్ గా సేవలందించారు, హైదరాబాద్ నగర పాలకలో విశేషమైన సేవలందించి ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. మున్సిపల్ ఆర్ & బి శాఖామాత్యులకు ఒ యస్ డి గా, పలువురు ప్రముఖుల తలలో నాలుకలా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత 2015వ  సంవత్సరంలో భాషా  సాంస్కృతిక శాఖకు మొట్టమొదటి  సంచాలకులుగా,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సీఈఓ గా నియమితులయ్యారు.

సాహిత్యంసవరించు

ఈయన దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఊరులో చిన్నపుడు పండుగలకు జరిగే నాటక ప్రదర్శనలతో ప్రభావితమై, అలానే గ్రామంలో ఉన్న గ్రంథాలయంలో వివిధ పత్రికలను చదివి, అందులోని సాహిత్యంతో ప్రభావితమై సాహిత్య రచన వైపు అడుగు వేసినట్టు చెప్పాడు. కాళీపట్నం రామారావు దగ్గర స్ఫూర్తి పొంది కథలు రాసానని, కాళీపట్నం రామారావు పరిచయం చేసిన ఎస్.కె. మిశ్రో ప్రభావంతో నాటక రచన చేసినట్టు తెలుస్తోంది.[2] ఇతని రచనల్లో సామాజిక-రాజకీయ అంశాలు ప్రధాన విషయంగా కనిపిస్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను ఉటంకిస్తూ హిందూ మతంలోని సామాజిక న్యాయాన్ని ఈయన రచనల్లో ప్రతిబింబించాడు. ఇతను రచించిన నాటకాలలో కించిత్ భోగం, గాంధీ జయంతి, జీవన్నాటకం, ఋత్విక్, కుర్చీ, బొమ్మలు చెప్పిన భజగోవిందం చెప్పుకోదగ్గవి. వీటిలో కొన్ని కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమయ్యాయి.

రచనల జాబితాసవరించు

గుర్తింపుసవరించు

పురస్కారాలు[3]సవరించు

 1. కుర్చీ నాటకానికి గానూ 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 2. మబ్బుల్లో బొమ్మ నాటకానికి గానూ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 3. జీవన్నాటకం నాటకానికి గానూ 2003 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 4. 2003లో ఆంధ్ర సారస్వత సమితి నుండి ఉగాది సాహిత్య పురస్కారం
 5. మినిస్టర్ నాటకానికి గానూ 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 6. 2004 సంవత్సరానికి ఢిల్లీ తెలుగు అకాడెమీ నుండి రాష్ట్రీయ వికాస్ శిరోమణి పురస్కారం(ఉగాది పురస్కారం)
 7. 2004లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం
 8. బాపూ చెప్పిన మాటటెలిప్లేకి గానూ 2005 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 9. బొమ్మలు చెప్పిన భజగోవిందం నాటకానికి గానూ 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ రచయిత నంది పురస్కారం
 10. 2010లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి ఉత్తమ నాటక రచయిత పురస్కారం
 11. టీవీ1లో ప్రసారమైన జీవన్నాటకం టెలిప్లేకి గానూ 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నంది పురస్కారం
 12. 2011లో ఢిల్లీ తెలుగు అకాడెమీ ఉత్తమ ప్రతిభా పురస్కారం(సాహిత్యరంగం)
 13. 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందించిన గురజాడ సాహితీ పురస్కారం

మూలాలుసవరించు

 1. "D. Vizai Bhaskar". కేంద్ర సంగీత నాటక కళా ఆకాడెమీ. Retrieved 4 August 2019.
 2. డిడి సప్తగిరిలో దీర్ఘాసి విజయభాస్కర్ ఇంటర్వ్యూ
 3. "విజయభాస్కర్ వెబ్‌సైట్‌లో అవార్డుల వివరణ ఉన్న విభాగం". Archived from the original on 2019-08-04. Retrieved 2019-08-04.

బయటి లంకెలుసవరించు

 1. వ్యక్తిగత వెబ్‌సైట్ Archived 2019-08-04 at the Wayback Machine
 2. టీవీ1 లో నాటకరంగ ప్రముఖులతో జీవన్నాటకం పేరుతో విజయభాస్కర్ చేసిన ఇంటర్వ్యూలు
 3. ఫేస్‌బుక్ లో దీర్ఘాసి విజయభాస్కర్