దురదగుంట తీగ
దురదగుంట తీగ వృక్ష శాస్త్రీయ నామం Tragia involucrata. దీనిని చినుగంట తీగ అని కూడా అంటారు. (సంస్కృతం : దుస్పర్శః, దురాల్భా, అనంత,యవశ)హింది : బర్ హన్తా, ఆంగ్లం : ఇండియన్ స్టింగింగ్ నేటిల్:మలయాళం : (కొడుదూవ,కొడిదూవ, చొరియణం). ఇది వృక్ష శాస్త్రములోని యుఫోర్బిఎసే కుటుంబమునకు చెందినది. ఈ మొక్కను ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాలలో విరివిగా ఉపయోగిస్తారు.
దురదగుంట తీగ | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | టి. ఇన్వొల్యుక్రేటా
|
Binomial name | |
ట్రాజియా ఇన్వొల్యుక్రేటా |
వ్యాప్తిసవరించు
భారతదేశమంతటా పెరిగే తీగ. దీనిని తేలుకొండి చెట్టు లేదా తేలుకొండి మొక్క అని కూడా అంటారు.
మొక్క వర్ణనసవరించు
నిత్యము ఆకుపచ్చగానే ఉండే ప్రాకెతీగ. దీనికి సన్నని గుచ్చుకొనే ముళ్ళు ఉంటాయి. దీని తీగ కాండం మెత్తగా ఉంటుంది. చెట్లకొమ్మల్ని చుట్టుకొంటూ ప్రాకుతుంది. ఆకులు సాధారణ ఆకృతిలోనే ఉంటాయి. తీగకు ఒకదానిపైన మరొకటి ఉంటాయి. ఆకు తొడిమ కుదురు మరొకవైపున పూవులు ఉంటాయి. ఇందులో మగపూవులతో బాటు, ఆడపూవు ఉంటుంది. అదే కాయగా మారుతుంది. కాయ మూడు భాగాలుగా ఉంటుంది. అదే గింజలుగా తయారవుతాయి. అవి గుండ్రంగా నున్నగా ఉంటాయి.
ఔషధ ఉపయోగాలుసవరించు
వేర్లు,చేదు, కారం రుచి కలిగి చలవను చేస్తాయి. మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తాయి. చెమటపట్టిస్తాయి. తరచుగా వచ్చే రోగాలకు మంచి ఔషధము. రక్తశుద్ధి, దురదతో చర్మము పెట్లట, సుఖవ్యాధులు, రక్తపుమొలలో, మధుమేహము, గ్రహణి, రక్తదోషము, అజీర్తి, వాంతులు, తలదిమ్ము, పిత్త రోగాలపై మంచి ఔషధము. ఆకులు తలనొప్పులకు పనిచేస్తాయి.
ఉపయోగపడు భాగాలుసవరించు
వేర్లు, ఆకులు
ఇవి కూడా చూడండిసవరించు
- "Tragia". Integrated Taxonomic Information System. Retrieved 31 March 2010.