దుర్గా సోరెన్ (1970-2009) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు. జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. దుర్గా సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమారుడు.దుర్గా సోరెన్ భార్య జామా నియోజకవర్గం నుండి జార్ఖండ్ శాసనసభ సభ్యురాలిగా ఉంది ‌ ఆమె పేరు సీతా సోరెన్ .[1][2] దుర్గా సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కి అన్నయ్య అవుతాడు.

దుర్గా సోరెన్
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
In office
2000–2005
అంతకు ముందు వారునియోజకవర్గం ప్రారంభమైంది
తరువాత వారుసునీల్ సోరెన్
నియోజకవర్గంజామ్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ శాసనసభ సభ్యుడు
In office
1995–2000
తరువాత వారుఅతనే
వ్యక్తిగత వివరాలు
జననం(1970-09-10)1970 సెప్టెంబరు 10
మరణం(2009-05-21)2009 మే 21
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీJharkhand Mukti Morcha
జీవిత భాగస్వామిసీతా సోరెన్
బంధువులుహేమంత్ సోరెన్(తమ్ముడు) అంజలి సోరెన్ (చెల్లెలు)
సంతానంజయశ్రీ సోరెన్ రాజశ్రీ సోరెన్ విజయశ్రీ సోరెన్

దుర్గా సోరెన్ 1995 నుండి 2000 వరకు జామా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి జార్ఖండ్ శాసనసభ సభ్యునిగా పనిచేశారు. అతను 2005 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో జామ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి సునీల్ సోరెన్ చేతిలో ఓడిపోయాడు. దుర్గా సోరెన్ లోక్‌సభకు గొడ్డా నియోజకవర్గం నుండి పోటీ చేశాడు కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నిషికాంత్ దూబే చేతిలో ఓడిపోయాడు.

దుర్గా సోరెన్ బొకారో లోని తన నివాసంలో 2009 మే 21న 40 ఏళ్ల వయసులో నిద్రలోనే మరణించాడు. దుర్గా సోరెన్ మరణానికి కారణం మెదడు రక్తస్రావం అని తేలింది.

మూలాలు

మార్చు
  1. "webindia123". Archived from the original on 2016-08-04. Retrieved 2024-06-25.
  2. "JMM suspends Durga Soren". Hindustan Times. PTI. 13 April 2009. Retrieved 20 September 2019.