శిబు సోరెన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎంపీగా, 2005లో 10 రోజులపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత 2008 నుండి 2009 వరకు & 2009 నుండి 2010 వరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1][2]

శిబు సోరెన్
శిబు సోరెన్


రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
22 జూన్ 2020
ముందు ప్రేమ్ చాంద్ గుప్తా
నియోజకవర్గం జార్ఖండ్

పదవీ కాలం
30 డిసెంబర్ 2009 – 31 మే 2010
గవర్నరు
  • కే. శంకరనారాయణన్
  • ఎం. ఓ. హెచ్. ఫరూక్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
27 ఆగష్టు 2008 – 18 జనవరి 2009
గవర్నరు సయ్యద్ సిబ్తే రాజీ
ముందు మధు కోడా
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
2 మార్చి 2005 – 12 మార్చి 2005
గవర్నరు సయ్యద్ సిబ్తే రాజీ
ముందు అర్జున్ ముండా
తరువాత అర్జున్ ముండా

బొగ్గు గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
29 జనవరి 2006 – 28 నవంబర్ 2006
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మన్మోహన్ సింగ్
తరువాత మన్మోహన్ సింగ్
పదవీ కాలం
27 నవంబర్ 2004 – 2 మార్చి 2005
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మన్మోహన్ సింగ్
తరువాత మన్మోహన్ సింగ్
పదవీ కాలం
23 మే 2004 – 24 జులై 2004
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మమతా బెనర్జీ
తరువాత మన్మోహన్ సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2019
ముందు బాబూలాల్ మరాండీ
తరువాత సునీల్ సొరేన్
నియోజకవర్గం దుమ్కా
పదవీ కాలం
1989 – 1998
ముందు పృథ్వీ చాంద్ కిస్కు
తరువాత బాబూలాల్ మరాండీ
Constituency దుమ్కా

వ్యక్తిగత వివరాలు

జననం (1944-01-11) 1944 జనవరి 11 (వయసు 80)
రాంగఢ్, బీహార్, (ప్రస్తుతం జార్ఖండ్, భారతదేశం)
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
జీవిత భాగస్వామి రూపీ సొరేన్
సంతానం
నివాసం బొకారో
మూలం [1]

వ్యక్తిగత జీవితం మార్చు

శిబు సోరెన్ రూపి కిస్కుని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు దుర్గా సోరెన్, హేమంత్ సోరెన్, బసంత్ సోరెన్, ఒక కుమార్తె అంజలి సోరెన్ ఉన్నారు. హేమంత్ సోరెన్ ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 1995 నుండి 2005 వరకు జామా నుండి ఎమ్మెల్యేగా పని చేశాడు. దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ జామ శాసనసభ నియోజకవర్గం డి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బసంత్ సోరెన్ జార్ఖండ్ యువమోర్చా అధ్యక్షుడిగా పని చేస్తూ దుమ్కా నుండి 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం మార్చు

శిబు సోరెన్ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1980లో దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. శిబు సోరెన్ 1989, 1991, 1996లో లోక్‌సభకు వరుసగా ఎన్నికై 1999లో ఓడిపోయాడు. ఆయన 2002లో రాజ్యసభకు ఎన్నికై అదే ఏడాది జరిగిన దుమ్కా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశాడు.

శిబు సోరెన్ 2004లో దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించాడు, కానీ చిరుదిహ్ కేసులో ఆయన మీద అరెస్ట్ వారెంట్ రావడంతో 24 జూలై 2004న రాజీనామా చేశాడు. శిబు సోరెన్ నెలపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తర్వాత సెప్టెంబరు 8న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆయన విడుదలయ్యాక కేంద్ర మంత్రివర్గంలో 27 నవంబర్ 2004న బొగ్గు మంత్రిత్వ శాఖ భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. Rediff (27 August 2008). "Shibu Soren sworn in as Jharkhand CM". Archived from the original on 17 April 2023. Retrieved 17 April 2023.
  2. The Economic Times (30 December 2009). "Shibu Soren sworn in as Jharkhand Chief Minister". Archived from the original on 17 April 2023. Retrieved 17 April 2023.
  3. Soren back in Union Cabinet The Hindu. 28 November 2004. Retrieved 22 August 2007.