దూదిమెట్ల బాలరాజు యాదవ్

దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా 2021 డిసెంబరు 17న నియమితుడై,[2] 2021 డిసెంబరు 30న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు[3]

దూదిమెట్ల బాలరాజు యాదవ్‌
దూదిమెట్ల బాలరాజు యాదవ్


తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 డిసెంబర్ 2021 - 07 డిసెంబర్ 2023[1]

వ్యక్తిగత వివరాలు

జననం 1 జనవరి 1981
పాలెం గ్రామం, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బిక్షమయ్య, అమృత
జీవిత భాగస్వామి దూదిమెట్ల రాజేశ్వరి
సంతానం 2
నివాసం ఎల్.బి.నగర్, హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

జననం, విద్యాభాస్యం

మార్చు

దూదిమెట్ల బాలరాజు యాదవ్ 1981 జనవరి 1లో తెలంగాణ రాష్ట్రం,నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలో బిక్షమయ్య యాదవ్, అమృత దంపతులకు జన్మించాడు. ఆయన నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ, బి.జెడ్.సి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఇడి., వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ, జువాలజీ పూర్తి చేసి, 2016లో 'ఏకాలజికల్ సడీస్ ఆన్ ఉదయసముద్రం రిజర్వాయర్ ఇన్ నల్లగొండ డిస్ట్రిక్' అనే అంశంపై ప్రొఫెసర్ సునీతాదేవి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి జూవాలజీ విభాగంలో పిహెచ్.డి పట్టా అందుకున్నాడు.[4]

ఉద్యమ నేపథ్యం

మార్చు

దూదిమెట్ల బాలరాజు యాదవ్ 1999 ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శిగా, సి.పి.ఎం. పార్టీ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2006లో ఓయూలో పిహెచ్.డి.లో చేరినప్పటి నుండి మలిదశ ఉద్యమంలో కీలకంగా పాల్గొని ఓయూ జేఏసీలో వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేసి, 2009 నుంచి ఉస్మానియా విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధిగా, జేఏసీ కన్వీనర్‌గా వివిధ హోదాల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. బాలరాజు యాదవ్ 2010లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేసిన అరవింద్ రెడ్డికి మద్దతుగా మంచిర్యాల ఉప ఎన్నికలలో విద్యార్థి జేఏసీ నేతగా, ఇంఛార్జీగా పనిచేశాడు. ఆయన 2013 సెప్టెంబరు 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన సభలో నిరసన వ్యక్త పరచడంతో ఏపీ ఎన్జీవోలు ఆయనపై దాడి చేసి గాయపర్చారు.

తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న ఆయనపై 150 కి పైగా కేసులు,, 2010, మొదటి 2011లో జైలుపాలై 50 రోజుల జైలు జీవితం గడిపాడు. 2010 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 7 వరకు 21 రోజులు 721 కి.మీ.ల మహాపాదయాత్రలో పాల్గొన్నాను. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి మద్దతుగా పాదయాత్రలు, బస్సుయాత్రలు, నిరాహారదీక్షల్లో పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

దూదిమెట్ల బాలరాజు యాదవ్ 2014 సాధారణ ఎన్నికలలో ఆయన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ టికెట్ ఆశించిన పలు కారణాల వల్ల టికెట్ దక్కలేదు. ఆయన 2014, 2018ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 2021లో జరిగిన ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయన తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా 2021 డిసెంబరు 17న నియమితుడై,[5] 2021 డిసెంబరు 30న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[6]

మూలాలు

మార్చు
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (18 December 2021). "అయిదు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  3. Sakshi (31 December 2021). "గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా దూదిమెట్ల". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  4. Andhrajyothy (18 December 2021). "ఉమ్మడి జిల్లాకు 2 పదవులు". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  5. Namasthe Telangana (17 December 2021). "ఉద్యమకారులకు ఉన్నత స్థానం". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  6. Dishadaily (దిశ) (30 December 2021). "బాధ్యతలు చేపట్టిన బాలరాజు". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.