లాల్ బహదూర్ నగర్
లాల్ బహదూర్ నగర్ లేదా టూకీగా ఎల్.బి.నగర్, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్ మండలానికి చెందిన గ్రామం, పురపాలక సంఘం. ఇది మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీపంలో చంపాపేట, కర్మన్‌ఘాట్, వనస్థలిపురం, కొత్తపేట, దిల్‍సుఖ్‍నగర్, సరూర్‌నగర్, నాగోల్, బి.ఎన్.రెడ్డి నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ఎల్.బి. నగర్
బహదుర్గూడా | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
నగరం | హైదరాబాదు |
Government | |
• శాసనసభ్యుడు | దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (తెరాస) ([1] |
జనాభా (2001) | |
• Total | 2,61,987 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 001 |
తెలిఫోన్ కోడ్ | 91 040 |
Vehicle registration | TS |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గ | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
వాణిజ్యం
మార్చుఇది వర్తక వ్యాపారాలకు వాణిజ్య ప్రాంతంగా ఉంది.
- ఎల్.పి.టి. మార్కెట్
- నెక్స్ట్ గల్లెరియా మెట్రో మాల్
- సుల్తాన్ మాల్
- మెట్రో బిజినెస్ సెంటర్
- స్వాగత్ హన్డ్లూమ్స్
- చెన్నై షాపింగ్ మాల్
- వైష్ణవి ఆనిక్స్
- శ్రీ గణేష్ ఫుట్ వేర్
- మస్ కార్స్
దేవాలయాలు
మార్చు- సీతారామాంజనేయ దేవాలయం
- కిల్లా మైసమ్మ దేవాలయం
- ఆంజనేయ దేవాలయం
విద్యాసంస్థలు
మార్చు- కామినేని వైద్య విజ్ఞాన సంస్థ
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్
- దీక్ష జూనియర్ కళాశాల
- అవినాష్ డిగ్రీ కళాశాల
- మహాత్మా గాంధీ న్యాయ కళాశాల
- కాకతీయ టెక్నో పాఠశాల
- తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల
- శ్రీగాయత్రి జూనియర్ కళాశాల
- ఎలిట్ పారా మెడికల్ కళాశాల
- ఉదయ మహిళా డిగ్రీ కళాశాల
- క్రియేటివ్ మల్టిమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
రవాణా
మార్చువిజయవాడ నుండి హైదరాబాదు నగరాన్ని ఆనుకొని ఈ ఎల్.బి.నగర్ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను కూడా ఉంది.
అభివృద్ధి కార్యక్రమాలు
మార్చు- రూ. 42 కోట్ల వ్యయంతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో నిర్మించిన ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ను 2019, మార్చి 1న ప్రారంభించారు.[3]
- రూ. 40 కోట్ల వ్యయంతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఎల్.బి. నగర్ అండర్ పాస్ నిర్మించారు.[4] 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు అండర్ పాస్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[5][6]
- రూ. 42 కోట్ల రూపాయలతో 960 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 3 లైన్లతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో నిర్మించిన ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్ను 2023 మార్చి 25న కేటీఆర్ ప్రారంభించాడు.[7][8]
చిత్రమాలిక
మార్చు-
ఎల్.బి.నగర్ దృశ్యాలు
-
ఎల్.బి.నగర్ దృశ్యాలు
-
ఎల్.బి.నగర్ దృశ్యాలు
-
ఎల్.బి.నగర్, ప్రధాన కూడలిలో వున్న విగ్రహాలు
మూలాలు
మార్చు- ↑ http://myneta.info/ap09/candidate.php?candidate_id=1496
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ The Hindu, Hyderabad (2 March 2019). "L.B. Nagar flyover opened for traffic". Archived from the original on 2 March 2019. Retrieved 3 August 2020.
- ↑ "KTR to inaugurate Kamineni Junction flyover, underpass on Thursday". Telangana Today. 27 May 2020.
- ↑ telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-04-04.
- ↑ "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-04-04.
- ↑ "ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో". Sakshi. 2023-03-26. Archived from the original on 2023-03-25. Retrieved 2023-03-27.
- ↑ Telugu, 10TV; naveen (2023-03-25). "LB Nagar RHS Flyover : ఇక ఉండదు ట్రాఫికర్.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". 10TV Telugu. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)