దూరదర్శన్ యాదగిరి
దూరదర్శన్ యాదగిరి భారతదేశ జాతీయ ప్రసార మాధ్యమైన దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ తెలుగు భాష టెలివిజన్ ఛానల్. దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న 11 భారతీయ ప్రాంతీయ భాషా ఛానళ్ళలో దూరదర్శన్ యాదగిరి ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ నుండి ఈ ఛానల్ ప్రసారం అవుతుంది. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం యాదాద్రి పేరిట ఈ ఛానల్‌కు దూరదర్శన్ యాదగిరి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నామకరణం చేశారు.[1]
దూరదర్శన్ యాదగిరి | |
country = | |
లభ్యత | భారత దేశం, ఇతర ఆసియా దేశాలు. |
యజమాని | ప్రసార భారతి |
కీలక వ్యక్తులు | కె.యస్. శర్మ |
ఆవిర్భావ దినం | 27.09.2014 ( హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం) |
ఇతరపేర్లు | యాదగిరి దూరదర్శన్ కేంద్రం, డి డి -8 |
దూరదర్శన్ ఛానల్ చరిత్రసవరించు
1977, అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చే దూరదర్శన్ ఛానల్ ప్రారంభించబడింది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. 1998 నుంచి 24 గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి "దూరదర్శన్ సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మార్చబడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం దీనిని దూరదర్శన్ యాదగిరిగా మార్చారు.ఈ ఛానల్ కార్యకలాపాలను రామాంతపూర్ లోని కార్యాలయం నుండి నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలంగాణ సంస్కృతిని, మాండలికలపై ప్రత్యేక దృష్టిని సారించింది.[2][3]
మూలాలుసవరించు
- ↑ నమస్తే తెలంగాణ. "దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ 'యాదగిరి'". Archived from the original on 26 సెప్టెంబరు 2014. Retrieved 2 January 2017.
- ↑ DD launches Telangana Channel
- ↑ Saptagiri for AP - Yadagiri for Telangana