దూసి బెనర్జీ భాగవతార్

దూసి బెనర్జీ రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. 1948లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం జె.వి.సోమయజులు, జె.వి.రమణమూర్తి (నటరాజ్‌ కళాసమితి), రావికొండలరావుల శిష్యరికంలో ఎన్నో పాత్రలు ధరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సొంత గ్రామం దూసి. అసలు పేరు కూర్మనాధశర్మ. తూర్పు భాగవతం పాడడం వల్ల సురేంద్రనాధ్‌ బెనర్జీ అని పిలిచేవారని గతంలో ఆయన 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 1946 నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు వేశాడు. కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో నటజీవితం ప్రారంభమైంది. 1955లో బండారు చిట్టిబాబు, రావి కొండలరావులతో కలిసి బెనర్జీ సుకుమార ఆర్కెస్ట్రాను ప్రారంభించాడు. కొన్నాళ్లు ఖాదీ పరిశ్రమలో ఉద్యోగం చేశాడు. 1956లో బుర్రకథ ప్రదర్శనలు, 1970 నుంచి హరికథాగానం చేయడం ప్రారంభించాడు.

దూసి బెనర్జీ
DUSI BENERJEE
దూసి బెనర్జీ
జననంకూర్మనాధ శర్మ
దూసి,ఆమదాలవలస మండలం
శ్రీకాకుళం జిల్లా
మరణంఅక్టోబరు 28, 2011
మరణ కారణంcancer
నివాస ప్రాంతందూసి,ఆమదాలవలస మండలం
శ్రీకాకుళం జిల్లా
ఇతర పేర్లుబెనర్జీ
వృత్తిగాయకుడు,సంగీత దర్శకుడు
ప్రసిద్ధిహరికథ కళాకారుడు
మతంహిందూ
పిల్లలుsrinivasa ravi Sankar, Mahalaxmi
తల్లిchayamma

చిన్ననాటి నుంచే సంగీత సాధన

మార్చు

చిరుప్రాయం నుంచే సంగీతం, పాటలు పాడటం మొదలుపెట్టిన ఆయన తబలా వాయిద్యం కూడా స్వయంకృషితో నేర్చుకున్నదే. 'రాధామనసు' లలిత గీతాలు పుస్తకం రాయడమే కాకుండా కొన్ని పాటలు రేడియోలో ప్రసారమయ్యాయి. గీతోపదేశం పేరిట భగవద్గీతను పాటల రూపంలో రాసి ప్రచురించాడు. సుధా బిందువులు సినిమాలో సంగీతం నిర్వహిస్తూ పాటలు పాడాడు. అరసవల్లిలో ఏటా జరిగే స్వామివారి ఏకాంతసేవ సంగీత రూపకంలో సూత్రధారునిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాన్నాడు.

సుకుమార ఆర్కెస్ట్రాలో

మార్చు

1955లో సుకుమార ఆర్కెస్ట్రాను సినీనటుడు రావికొండలరావుతో కలిసి స్థాపించాడు. బండారు చిట్టిబాబు హార్మోనియం, బెనర్జీ తబలాతో వాద్య సహకారం అందించేవారు. సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌, మండపాక శారద, బి.వి.రమణ లాంటి వారెందరో శిక్షణ పొంది పాడేవాడు. రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాల్లో వేల ప్రదర్శనలిచ్చారు. జానకీ, ఆనంద్‌, జి.రామకృష్ణ వంటి గాయకుల నరసన పాడాడు.

హరికథా భాగవతార్‌గా

మార్చు

దానయ్య భాగవతార్‌ వద్ద హరికథా ప్రక్రియ నేర్చుకున్న బెనర్జీ కొన్నివేల ప్రదర్శనలించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళిక కోసం బుర్రకథా కళాబృందాన్ని తీసుకువెళ్లి బంగారు పతకం పొందారు. సీతాకల్యాణం, దక్షయజ్ఞం, శ్రీనివాస కల్యాణం వంటి కథలను గానం చేశారు. ఆయన ఆంగ్లంలోను, హిందీభాషలో కూడా హరికథాగానం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తను స్వయంగా రచించి గానం చేసిన గీతోపదేశం, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, రాణిరుద్రమ, షిరిడీసాయిబాబా కథలు గానం చేశారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుల ప్రశంసలు పొందాడు.

అవార్డులు

మార్చు
  • మద్రాస్‌ తెలుగు అకాడమీ పురస్కారం
  • మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుచే సత్కారం
  • అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి (జీవితగాథను పాటగా విన్పించి) సత్కారం పొందారు.
  • కలెక్టర్లు, రాష్ట్రమంత్రులు, పలు సందర్భాల్లో సత్కారాలు, ప్రశంసలు

మరణము : 28-అక్టోబరు -2011.

మూలాలు

మార్చు