దేవరాజు రవి

ప్రముఖ రచయిత, సినీ విమర్శకుడు, సామాజిక కార్యకర్త

దేవరాజు రవి ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయిత అయిన దేవరాజు వేంకటకృష్ణారావు ఇతనికి తండ్రి.

దేవరాజు రవి
దేవరాజు రవి
జననం
దేవరాజు వేంకట సత్యనారాయణరావు

(1939-04-05)1939 ఏప్రిల్ 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విజయనగరం జిల్లా, మృత్యుంజయనగరం గ్రామం
మరణం2018 మార్చి 2(2018-03-02) (వయసు 78)
ఇతర పేర్లుమాస్టర్ రవి
వృత్తిరచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కథా రచయిత,
నవలా రచయిత,
సినిమా సమీక్షకుడు,
సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిదేవరాజు సీత
పిల్లలుశ్రీనివాసరావు,
బాలకృష్ణ
తల్లిదండ్రులు

జీవిత విశేషాలు మార్చు

ఇతని అసలు పేరు దేవరాజు వేంకట సత్యనారాయణరావు. ఇతడు విజయనగరం జిల్లా మృత్యుంజయనగరం గ్రామంలో 1939, ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు[1]. ఇతని స్వస్థలం బరంపురం. ఇతడు 12 నవలలు, 200 పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ వ్రాశాడు. మొదటిసారిగా 1959లో రామం అనే నవలను రచించాడు. అప్పటి నుంచి ప్రారంభమైన ఇతని రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. ఇతడు మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఇతడు చేసిన సమీక్షలు సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి. ఇతడు నంది అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు సామాజిక కార్యకర్తగా కూడా విశేషంగా కృషిచేశాడు. ఎంతోమంది కుష్టు రోగులకు స్వయంగా సేవ చేశాడు. లెప్రసీ డాక్టర్‌గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవీ విరమణ అనంతరం కూడా ఆ సేవల్ని కొనసాగించాడు. ఇతడు మేఘసందేశం అనే సినీవారపత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఇతడు ఆంధ్రపదేశ్ సినీక్రిటిక్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సినిమా రచయితల సంఘం మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు.

రచనలు మార్చు

నవలలు మార్చు

  1. రామం
  2. సంగమం
  3. ఎడారిలో కోయిల
  4. కొత్త వెలుగు
  5. కసి
  6. మేము సైతం
  7. వెన్నెల కురిసింది
  8. చీకటి దీపాలు

ఏకాంకిక మార్చు

  1. కొత్త వెలుగు

కవితా సంపుటులు మార్చు

  1. వేగుచుక్క
  2. ఇది హృదయం

కథా సంపుటులు మార్చు

  1. దేవరాజు రవి కథలు[2]
  2. బతుకే బంగారం (దేవరాజు సీతతో కలిసి)

కథలు మార్చు

ఇతని కథలు చిత్రగుప్త, కథాంజలి, వినోదిని, ఢంకా, కృష్ణాపత్రిక, ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రజ్యోతి, ప్రగతి, తరుణ, స్వాతి, స్నేహ, జయశ్రీ, అనామిక, పల్లకి, జనసుధ, మధురిమ, సినీప్రభ, జోక్స్, జైదండోరా, నెలవంక, తారాపథం, ఆనందజ్యోతి, మధురవాణి, కొరడా, కాగడా, ఆదర్శరైతు, విజయసారథి తదితర పత్రికలలో ప్రచురించబడ్డాయి. వాటిలో కొన్ని తమిళ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని కథలలో కొన్ని:

  1. అడ్డాలనాటి బిడ్డలు
  2. అన్నీ నల్లకాకులే
  3. అమ్మ చచ్చిపోయింది
  4. ఆగండి! కాస్త ఆలోచించండి!
  5. ఇదోరకం ఆత్మహత్య
  6. ఇప్పుడు చెప్పవే పిల్లా
  7. ఎక్కడుంది లోపం
  8. ఎర్రంచు తెల్లచీర
  9. కోరిక
  10. చిల్లంగి పెట్టేశారు
  11. చెకింగ్
  12. దెయ్యాల్లేకేం
  13. దేవుడూ నీకు జోహార్లు
  14. ధర్మం చెయ్ బాబూ
  15. నాకు పెళ్లేవిటి నాన్నా
  16. నిన్ను నీవు ప్రశ్నించుకో!
  17. నేను చచ్చిపోతే మంచిది
  18. పూర్తికాని కథ
  19. బతికిపోయాను బాబూ
  20. మంచి మనసు
  21. మంత్రిగారొస్తారు
  22. మానవచరిత్ర మళ్ళీ మొదలైంది
  23. వాహకులు కావాలి
  24. విప్లవం రాకేంచేస్తుంది
  25. స్పర్శ
  26. కాలు జారితే
  27. వెనకడుగు
  28. నల్లబావ తెల్లమరదలు
  29. చివరకు మిగిలేది
  30. వికసించని కుసుమాలు
  31. వసంతోదయం
  32. కళ్యాణి కల్యాణం
  33. శేషప్రశ్న

పురస్కారాలు మార్చు

  • వంశీ బర్కిలీ అవార్డు
  • సేవాచక్ర పురస్కారం - కళాంజలి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారిచే
  • వెన్నెల కల్చరల్ అసోసియేషన్, నర్సీపట్నం వారిచే సన్మానం.
  • సేవాభూషణ్ పురస్కారం

మరణం మార్చు

ఇతడు తన 79వ యేట హైదరాబాదులోని మేడిపల్లిలో తన నివాసంలో 2018, మార్చి 2వ తేదీన మరణించాడు[3].

మూలాలు మార్చు

  1. Who's who of Indian Writers, 1999: A-M (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. 1999. p. 320. ISBN 81-260-0873-3. Retrieved 2 March 2018.
  2. దేవరాజు రవి కథలు పుస్తకం అంతర్జాలంలో[permanent dead link]
  3. విలేకరి. "ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Archived from the original on 3 మార్చి 2018. Retrieved 2 March 2018.

బయటి లింకులు మార్చు