దేవాలయాల్లో కామశిల్పం

భారతదేశంలో అనేక దేవాలయాలలో గోపురాలమీద, దేవాలయ స్తంభాలమీద, గోడలమీద లేదా గర్భగృహ గోడలమీద గాని, ఇతరత్ర అనేక ప్రదేశాలలో కామశిల్పాలను చెక్కటం మనము చూస్తూనే ఉంటాము. వీటిలో ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు లక్ష్మణ దేవాలయము, ఇతర సమూహ ఆలయ మండపాలలో, కోణార్క సూర్య దేవాలయం, కర్ణాటకలోని హళేబీడు, బేలూరు ఆలాయలలో, మధుర మీనాక్షీ ఆలయం మొదలైనవి ప్రఖ్యాతి గాంచినవి. ఇవేకాక అనేక ఇతర ప్రాంతాలలో ఇటువంటి కామశిల్పాలను చెక్కటం జరిగింది. వీటికి గల కారణాలు ఖచ్చింతంగా ఇవే అని చెప్పలేము. ఇవి కేవలం కామం పురుషార్ధం సంకేతకమా? లేకా మోక్ష ప్రాప్తికి చిహ్నములా? లేక కామ శాస్త్రీయాలా? లేకా క్రీడా సంకేతాలా? లేక వినోద క్రీడలా? పైగా ఈ మైధున శిల్పంలో రాజులు, వేటగాళ్ళు, వేశ్యాస్త్రీలు, ఇతరాతర అనేక రకాల స్త్రీ, పురుషుల చిత్రాలవలన ఇదే అని ఖచ్చింతంగా చెప్పలేకున్నారు. ముఖ్యంగా ఈ కామశిల్పం కొన్ని చోట్ల ఫలసూత్రం (ఫెర్టిలిటీ) తో ముడిపడు ఉండటం గమనించవలసిన విషయం. వీటి చిత్రీకరణకు ఆకాలం నాటి ప్రజలు, ధనికుల మద్దతు కచ్చితంగా లభించి ఉన్నదనే చెప్పవచ్చును. వారెవరు వీటిని మతవిరుద్ధాలుగా, శాస్త్ర విరుద్ధాలగా భావించనందువలనే వీటికి కాలానుకాలం ప్రోత్సాహం లభించి ఉన్నదని అనుకోవచ్చును.కావున కామశిల్పం దేవాలయంలో ఉన్న భాగాలపై విస్తృతంగా చెక్కబడింది. ఇది భారతదేశంలో అన్ని ప్రాంతాలకు వర్తిస్తున్నది. కామశిల్పంపై డాక్టర్ దేవాంగన దేశాయ్ వంటి ప్రముఖులు చాలా పరిశోధనలు జరిపారు. కానీ మధ్యయుగం ప్రాంతం నాటి కామశిల్పంపే ఇంకా అనేక పరిశోధనలు జరగాలి. అలానే మనదేశంలోవాత్సాయనుడు వ్రాసిన కామశాస్త్రంకు ఈదేవాలయ చిత్రాలకు సంబంధాలు శాస్త్రవేత్తలు ఇవేఅని నిర్ధారించలేకున్నారు.

ఖజురహో ఆలయ శిల్పం

సాంస్కృతిక వాదాలు

మార్చు

ఈకామశిల్పానికి అనేక నైతిక వాదులు వివిధ వాదాలను తెలియ పరిచారు. వాటిలో ముఖ్యంగా ఒక వాదాన్ని బట్టి కామశిల్పం ద్వంద్వాత్మక ప్రకృతి కావలనున్న అద్వైత-ఏకత్వ స్థితిని చిత్రిస్తున్నదని ఉపనిషద్వాంత దృష్ట్యా చెప్పటం జరిగింది.దివ్యానంద స్థితికే స్త్రీ, పురుషుల సంయోగం సూచకమని వీరి భావన. ఈ ద్వంద్వం ప్రకృతి పురుషుల-జీవాత్మ పరమాత్మల సంయోగ ప్రతీక. కాని దేవాలయాలపై కల వివిధ కామభంగిమలు, నగ్న శిల్పాలకూ పైవాదం సరియైన సమాధానం ఇవ్వటంలేదని మరికొందరి వాదన. దీనికి కారణం కొన్ని దేవాలయాలలో బలవంతంగా కామానుభవాన్ని పొందుతున్న బొమ్మలూ లేకపోలేదు. ఉదాహరణకు హలిబిడులో కొన్ను బొమ్మలు.

మరొకవాదం ప్రకారం ఈబొమ్మలు కామవాద వ్యక్తీ కృతులు అని. అంటే కామం పురుషార్ధ ప్రతిబింబమని అందువల్ల కామం ధర్మానుబంధి అని వీరి భావన.అందుకే కొన్ని దేవాలయ అగ్రభాగాలలో ధర్మం, మధ్యలో అర్ధం, క్రిందిభాగంలో కామం చిత్రీకరించబడినది అని వీరు ప్రస్తావిస్తారు.కానీ వీరి వాదన ప్రకారం కామం కేవలం పురుషార్ధ ప్రకటనమే అయితే యోనిలింగనభూషణం వంటి శాస్త్ర నిషిద్ధ కామం దేవాలయాలపై ప్రకటీకృతంకావటం వలన ఇది కుదరదు అని మరికొందరు ఖండిస్తారు.

మరొకవాదన ప్రకారం జితీంద్రియతత్వం దీనివల్లనే చిత్రించబడినదని. ఇందుకే జితేంద్రియతత్త్వ సూచకముగా కామశిల్పం దేవాలయం బయటి గోడలమీద చెక్కబడింది.మొక్ష దృష్ట్యా ఇది అడుగునపడిపోవడానికికి తార్కాణమంటారు. అంటే మోక్ష లబ్ధికి కామం విఘ్నకారణమని వారి ఉద్దేశం. కాని ఈశిల్పం గుడి బయటా, లోపలా గర్భగుడి గోడలమీద చెక్కబడి ఉండటం గమనార్హ్గం.

మరొకవాదం ప్రకారం ఈకామశిల్పాలు భక్తుల కామ విజయాలకు చిహ్నాలు. అంటే వారి ఆధ్యాత్మిక శక్తికివి పరీక్షలు అని.కాని విజయనగర దేవాలయలలో మారు మూలల్లో ఉన్న కామశిల్పం ఈ సిద్ధాంతానికి వ్యతిరేకం.

కొందరు ప్రకారం ఈబొమ్మలు కామశాస్త్ర బోధకాలు అని.కానీ దేవాలయలలో పాశవికతాను తృష్ణను చిత్రించిన దృశ్యాలు లేకపోలేదు.అవి బోధనికార్హాలు.

చారిత్రికత

మార్చు

దేవాలయలలో కామశిల్పాల చిత్రీకరణను చారిత్రికులు మూడు కాలాలుగా విభజించిరి.మొదటికాలం సా.శ. 500దాకా. ఈకాలంలో మైధున శిల్పం మతకళలలో కనిపించదు.కాను మట్టి పాత్రలపై ఉంది.శిల్పంలో స్త్రీ, పురుషుల బొమ్మలు ఉన్నా అవి కామకేళిలో నిమగ్నం కానివే. అనగా మధ్యకాలంలో ఈ కళ హఠాత్తుగా వచ్చిందికాదు. సా.శ. 500 నుండి 900 వరకు రెండవయుగం. ఇక్కడ మొదటిసారిగా మనకు మైధున శిల్పం కనిపిస్తుంది. ఈకాలం చివరిభాగంలో కామశిల్పం దేవాలయల మీదకు ఎగబాకినట్లు తెలుస్తున్నది.సా.శ. 900 నుండు 1400 వరకు మూడవయుగం. ఇక్కడ దేవాలయ శిల్పంలో కామకళ విపరీతంగా చోటుచేసుకుంది. కానీ దాని వ్యక్తీకరణలో బేధం ఉంది.అది శిల్పశైలి బేధం కావచ్చును. ఇందులో ద్వంద్వ మైధున క్రీడలు సా.శ.500 తరువాత పలుప్రాంతాలలో కనిపిస్తున్నవి.రెండు, మూడు యుగాలకు చెందిన కామశిల్పాలు పత్తడ్ కల్ లోను, ఎల్లోరాలోగల లంకేశ్వరగుహలోను, కోణార్క దేవాలయంమీద విపరీతంగా కనిపిస్తున్నవి.అనగా సా.శ.900-1400 కాలం కామశిల్పం దేవాలయంమీద విస్తృతంగా కనిపిస్తున్నట్లు గ్రహించాలి. ఈ శిల్పాన్ని ప్రోత్సహించినవారు ధనిక వర్గంవారై ఉంటారు.

అయితే ఈకామశిల్పం, ముఖ్యంగా ప్రేయసీ, ప్రియుల బహువిధ క్రీడలకు సంబంధించి ఉంది.అనగా ప్రేయసీ కపోలాన్ను స్పృసించటం దగ్గరనుంచి సంభోగ పర్యంతం వ్యాపించి ఉంది.ఇవే తరచు దేవాలయలపై చిత్రీకరించబడినవి. ఇందులో కొన్ని భేదాలు, ఇద్దరు స్త్రీలతో ఒక పురుషుడటం, ఇద్దరు పురుషులు ఒక స్త్రీ. కామ భావన దృష్ట్యా ఇవిరెండూ ఒక్కటే.సాంఘిక దృష్ట్యా బేధం ఉంది. మొదటిదానిలో బహు భార్యాతత్త్వము, రెండవదానిలో దేవదాసి లేక వేశ్యా సంగమం. రెండవది సంఘాతక సంబంధం. దీనిని కామసూత్ర వివరిస్తుంది. ఇందులో ముగ్గురు పురుషుల సంయోగక్రియ ఉంది. వీటిని హలిబిడు, బేలూరులో చూడవచ్చును. ఇందులో ఒక జంట సంయోగక్రియ జరుపుతున్నప్పుడు, ఒక సేవకుడు ఒక కూజాను పట్టుకొని ఆజంట క్రియకు తోడ్పడుతున్నట్లు (మధురాలయం), కొన్ని చోట్ల సంయోగక్రియ జరుపుతున్నప్పుడు సేవకుడు ఉన్నట్లు (కోణార్క్ ఆలయం), కొన్ని చోట్ల సేవకుడు కూడా ద్వంద్వ క్రియలో తోడ్పడుతున్నట్లు (ఖజురహో) చిత్రించబడినవి.

వాత్సాయనుడు చెప్పిన గోయూధిక, అంటే ఇద్దరికంటే ఎక్కువమంది స్త్రీలతో ఒక పురుషుని కామకేళి.ఈ శిల్పం కోణార్క ఆలయం సూర్యరధచక్రంపై చూడవచ్చును.

సంయోగ భంగిమలలో పురుషాయితమ సంస్కృత కవులకు, కామశాస్త్ర కర్తలకు ఇష్టమైన భంగిమ. శిల్పులు, చిత్రలేఖకులు దీనిని అనేకముగా వర్ణించారు. ఇందులో స్త్రీయే పురుషునితో రమించుట చిత్రించబడుతున్నది.ఇది భువనేశ్వర్, కోణార్క్, ఖజురహో శిల్పాలలో చూడవచ్చును. తాంత్రిక వాజ్మయమగు మహాకాల సంహితలో చిన్నమస్థదేవి ధ్యానములో ఉండగా రతీ మన్మధులు ఈ భంగిమలో ఆమె దగ్గిరలో కామకేళి జరుపుతున్నట్లు వర్ణించబడింది.

ముఖరతి లేదా విమార్గ. ఈభంగిమ క్రీ.పూ.2వ శాతాబ్ది కాలం బెంగాల్ మట్టిబొమ్మలలో మొదటిగా కనిపించింది.దీనినే సంస్కృతములో కాకిల అంటారు. ఎల్లోరా, ముఖలింగం ఆలాయలలో కనిపిస్తుంది. ఇది స్త్రీ, పురుషులు స్వకీయ కామక్రియ జరుపుకోవటం లేదా నగ్న ప్రదర్శన.

పాశుమత శివదీక్ష పుచ్చుకొనేవాళ్ళు విధిగా శృంగారన శాస్త్ర విధిని పాటించాలి అని వర్ణించబడింది. అందుకే బహుశా కొందరు సన్యాసుల కామక్రీడా మగ్నతకు ఇదేకారణం అని చెబుతారు.

కొన్ని దేవాలయాల శిల్పకళ

మార్చు

మూలాలు

మార్చు
  • 1983 భారతి మాసపత్రిక-వ్యాసం-దేవాలయాల్లో కామశిల్పం-వ్యాస కర్త: ఘంటా జవహర్ లాల్