దేవియాని శర్మ (జననం 1993 మే 30) భారతీయ సినిమా నటి. 2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం భానుమతి & రామకృష్ణతో తెలుగు చిత్రపరిశ్రమకు ఆమె పరిచయమయింది. ఆ తర్వాత, ఆమె క్రమంగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె హాట్‌స్టార్‌ ఓటీటీలో వచ్చిన సైతాన్ (2023), రొమాంటిక్ (2021), సేవ్ ది టైగర్స్ (2023) విజయవంతమైన చిత్రాలలో తన నటనతో ప్రసిద్ధి చెందింది.[1]

దేవియాని శర్మ
జననం (1993-05-30) 1993 మే 30 (వయసు 30)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి
తల్లిదండ్రులుసునీల్ శర్మ, నీనా శర్మ
బంధువులుసోనమ్ శర్మ

కెరీర్ మార్చు

ఆమె సునీల్ శర్మ, నీనా శర్మ దంపతులకు న్యూఢిల్లీలో 1993 మే 30న ఆమె జన్మించింది. ఆమెకు సోదరి సోనమ్ శర్మ ఉంది. టీనేజీలోనే మోడలింగ్ వైపు వెళ్ళిన ఆమె నటనపై ఆసక్తితో కొన్ని నాటకాలలో నటించింది. రొమాంటిక్ చిత్రంలో, అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సీరీసుల్లో ఆమె నటించింది.[2]

హిందీ చిత్రం లవ్ శుదా లో చిన్నపాత్రతో బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన ఆమె 2019లో టాలీవుడ్ చేరింది. భానుమతి & రామకృష్ణ (2020)లో తన నటనతో ఆకట్టుకుంది.

మూలాలు మార్చు

  1. "Deviyani Sharma: ఈ 'సైతాన్' భామ చూపు మారింది | Deviyani Sharma Wants Kollywood Chances KBK". web.archive.org. 2023-08-05. Archived from the original on 2023-08-05. Retrieved 2023-08-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Devyani Sharma: ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో మెప్పించాలని ఉంది | Save the Tigers Beauty Devyani Sharma About Upcoming Projects ktr". web.archive.org. 2024-05-20. Archived from the original on 2024-05-20. Retrieved 2024-05-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)