రొమాంటిక్‌ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించాడు.[1] ఆకాష్‌ పురి, కేతిక శర్మ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న విడుదలైంది.[2][3]

రొమాంటిక్‌
దర్శకత్వంఅనిల్‌ పాదూరి
రచనపూరి జగన్నాధ్
నిర్మాతపూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్
తారాగణంఆకాశ్ పూరి , కేతిక శర్మ, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంనరేష్ రానా
కూర్పుజునైద్ సిద్ధిఖీ
సంగీతంసునీల్‌ కశ్యప్‌
నిర్మాణ
సంస్థలు
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
విడుదల తేదీ
29 అక్టోబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

రొమాంటిక్‌ లోని ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే పాటను 2019 డిసెంబరు 21న, 'నా వాళ్ళ కాదే' లిరికల్ పాటను 2020 జనవరి 24న,[4] 'పీనే కే బాద్‌’ లిరికల్ పాటను అక్టోబరు 12న విడుదల చేశారు.[5]

గోవాలో పుట్టి పరిగిన వాస్కోడి గామా (ఆకాశ్‌ పూరీ) తండ్రి ఓ నిజాయతీ గల పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్‌ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) కల నెరవేర్చడం కోసం అండర్ వరల్డ్ లోకి అడుగు పెట్టి గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. ఒక పెద్ద డీల్ లో భాగంగా అనుకోని సంఘటనల వలన ఒక పోలీస్ అధికారిని చంపేస్తాడు. వాస్కో కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుండతారు. ఏసీపీ ర‌మ్యా గోవారిక‌ర్‌ (రమ్య కృష్ణ) వాస్కో కేసును డీల్ చేస్తుంది. మ‌రి ఏసీపీ ర‌మ్యా వాస్కోడి గామాను పట్టుకుందా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
  • నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: పూరి జగన్నాధ్
  • దర్శకత్వం: అనిల్‌ పాదూరి [7]
  • సంగీతం: సునీల్‌ కశ్యప్‌
  • సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విషు రెడ్డి
  • పాటలు: భాస్కర భట్ల, పూరి జగన్నాధ్
  • డాన్స్: జానీ మాస్టర్‌
  • ఆర్ట్ డైరెక్టర్: జాన్నీ షేక్
  • ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

పాటల జాబితా

మార్చు

1: పెన్నా కీ బాద్ , రచన: పూరీ జగన్నాద్ , గానం.సునీల్ కశ్యప్

2: ఇఫ్ యూ ఆర్ మాడ్ ఐయాం యువర్ డాడ్, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. యాజిన్ నిజార్, అశ్విన్

3: నావల్ల కాదే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సునీల్ కశ్యప్

4: మేరా నామ్ వాస్కొడిగామా, రచన: పూరీ జగన్నాద్ , గానం.ఆకాష్ పూరీ

5: వాట్ డో యూ వాంట్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.మంగ్లీ , కృష్ణ

6: డార్లింగ్, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.మేఘన , సాయిశ్రీ

7: నువ్వు నేను ఈ క్షణం , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.చిన్మయి శ్రీపాద

8: పీనే కె బాద్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, పూరీ జగన్నాద్ , గానం.సునీల్ కశ్యప్

మూలాలు

మార్చు
  1. Sakshi (20 December 2019). "'రొమాంటిక్‌' సినిమా నుంచి మరో అప్‌డేట్‌". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  2. Eenadu (25 September 2021). "రొమాంటిక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే..! - telugu news romantic release date announcement". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  3. Mana Telangana (19 October 2021). "వారం ముందుగానే 'రొమాంటిక్'..." Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  4. 10TV (24 January 2020). "నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపోద్ది నా వల్ల కాదే." (in telugu). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (13 October 2021). "ఆకట్టుకుంటున్న ఆకాశ్‌ కొత్త సాంగ్‌ 'పీనే కే బాద్‌'". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  6. Eenadu (29 October 2021). "రొమాంటిక్‌ మూవీ రివ్యూ". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  7. Namasthe Telangana (24 October 2021). "పూరి కన్నీళ్లు పెట్టుకున్నారు!". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.

బయటి లింకులు

మార్చు