దొంగల వేట, 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో , త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై పి బాబ్జీ, జీ.సాంబశివరావు, నటశేఖర కృష్ణ, జయప్రద జంటగా, నిర్మించిన ఈ సినిమాకి చెల్వపిళ్ళ సత్యం సంగీతం సమకూర్చారు. హిందీలో వినోద్ ఖన్నా నటించిన ఇన్ కార్ పేరుతో రిలీజ్ కాగా, తెలుగులో దొంగల వేట పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

దొంగల వేట
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర, గోపి, దాశరథి, సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

కృష్ణ పోలీసు శాఖలో పనిచేస్తుంటాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద ప్రేమించుకుంటారు. జయప్రద ప్రభాకరరెడ్డి కూతురు. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసుగా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రదను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.

పాటలు

మార్చు

ఈ సినిమాలోని 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగె ఉందామా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. పాహి పరాత్పర యదుకుల నందన కాళియమర్దన - పి.సుశీల బృందం - రచన: గోపి
  3. వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: దాశరథి
  4. మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన:ఆరుద్ర
  5. ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి

ఇతర విశేషాలు

మార్చు
  • ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
  • వినోద్ ఖన్నా హీరోగా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేటగా తెలుగులో నిర్మించారు.
  • కృష్ణ హీరోగా నటించారు.
  • హిందీలో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు. ఐతే అమ్జాద్ ఖాన్ కు ఆ పాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.
  • ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా, ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది) హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.

మూలాలు

మార్చు
  1. ఆరుద్ర సినీ గీతాలు, 5వ భాగం, సంకలనం: కె.రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దొంగల_వేట&oldid=4145530" నుండి వెలికితీశారు