కె.ఎస్.ఆర్.దాస్ (జనవరి 5, 1936 - జూన్ 8, 2012)[1]) తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్, క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

కొండా సుబ్బరామ దాస్
Ksr das directore.jpg
ప్రముఖ భారత దర్శకుడు స్వర్గీయ కె. ఎస్. ఆర్. దాస్
జననం(1936-01-05) 1936 జనవరి 5 1936, జనవరి 5
నెల్లూరు, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారత్)
మరణం2012 జూన్ 8 (2012-06-08)(వయసు 76)
చెన్నై, తమిళనాడు, భారత్
వృత్తిదర్శకుడు, సినీ ఎడిటర్
క్రియాశీలక సంవత్సరాలు1966–2000

నేపధ్యముసవరించు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనవరి 5, 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌ వివాహం 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు.[2] 1966లో ఆయన లోగుట్టు పెరుమాళ్ళకెరుక తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. రజనీకాంత్, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, దాసరి నారాయణరావు, అట్లూరి పూర్ణచంద్ర రావు... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.

పురస్కారములుసవరించు

ఇతనికి కర్ణాటక ప్రభుత్వం తరపున ప్రతిష్ఠాత్మక పుట్టణ్ణ కనగాల్ పురస్కారం లభించింది.

మరణముసవరించు

గుండెపోటుతో బాధపడుతూ 2012, జూన్ 8 వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]

సినీ జాబితా (దర్శకుడిగా , సహాయ దర్శకుడిగా)సవరించు

తెలుగు సినిమాలుసవరించు

క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 (1966) లోగుట్టు పెరుమాళ్ళకెరుక
2 (1968) రాజయోగం
3 (1969) రాజసింహ
4 (1969) గండర గండడు
5 (1969) గందరగోళం
6 (1969) టక్కరి దొంగ చక్కని చుక్క
7 (1969) ఉక్కుపిడుగు
8 (1970) రౌడీరాణి
9 (1971) బంగారు కుటుంబం
10 (1971) సి.ఐ.డి. రాజు
11 (1971) జేమ్స్ బాండ్ 777
12 (1971) కత్తికి కంకణం
13 (1971) మోసగాళ్ళకు మోసగాడు
14 (1971) ప్రేమ జీవులు
15 (1971) రౌడీలకి రౌడీలు
16 (1972) గన్‌ఫైటర్ జానీ
17 (1972) హంతకులు దేవాంతకులు
18 (1972) కత్తుల రత్తయ్య
19 (1972) పిల్లా? పిడుగా?
20 (1972) ఊరికి ఉపకారి
21 (1973) మంచివాళ్ళకు మంచివాడు
22 (1975) మా ఊరి గంగ
23 (1976) భలేదొంగలు
24 (1976) దొరలు దొంగలు
25 (1977) దేవుడున్నాడు జాగ్రత్త
26 (1977) దొంగలకు దొంగ
27 (1977) ఈనాటి బంధం ఏనాటిదో
28 (1978) ఏజెంట్ గోపి
29 (1978) అన్నదమ్ముల సవాల్
30 (1978) దొంగల వేట
31 (1979) ఇద్దరూ అసాధ్యులే
32 (1979) ఎవడబ్బ సొమ్ము
33 (1979) బంగారు గుడి
34 (1979) కెప్టెన్ కృష్ణ
35 (1979) దొంగలకు సవాల్
36 (1979) యుగంధర్
37 (1980) చేసిన బాసలు
38 (1980) దేవుడిచ్చిన కొడుకు
39 (1980) మిస్టర్ రజనికాంత్
40 (1980) మామా అల్లుళ్ళ సవాల్
41 (1980) శ్రీ వెంకటేశ్వర మహత్యం
42 (1981) రహస్య గూఢచారి
43 (1981) గిరిజా కళ్యాణం
44 (1981) మాయదారి అల్లుడు
45 (1982) తల్లీకొడుకుల అనుబంధం
46 (1982) బంగారు కొడుకు
47 (1982) షంషేర్ శంకర్
48 (1983) రోషగాడు
49 (1983) పులి బెబ్బులి
50 (1983) ఆడదాని సవాల్
51 (1983) అగ్నిసమాధి
52 (1983) పులిదెబ్బ
53 (1983) సిరిపురం మొనగాడు
54 (1984) భలే రాముడు
55 (1984) దొంగలు బాబోయ్ దొంగలు
56 (1984) నాయకులకు సవాల్
57 (1985) ఇదేనా చట్టం
58 (1985) నేరస్థుడు
59 (1986) కౌబాయ్ నెం.1
60 (1986) ఖైదీరాణి
61 (1986) కుట్ర
62 (1987) ముద్దాయి
63 (1988) దొరకని దొంగ
64 (1989) పార్థుడు
65 (1990) ధర్మ
66 (1990) ఇన్స్‌పెక్టర్ రుద్ర
67 (2000) నాగులమ్మ

కన్నడ సినిమాలుసవరించు

క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 1975 కళ్ళ కుళ్ళ
2 1976 బంగారద గుడి
3 1977 లక్ష్మీనివాస
4 1977 సహోదరర సవాల్
5 1978 కిలాడి కిట్టు
6 1981 స్నేహితర సవాల్
7 1981 జీవక్కే జీవ
8 1982 కార్మిక కళ్ళనల్ల
9 1983 తిరుగు బాణ
10 1983 చిన్నదంత మగ
11 1984 ఖైదీ
12 1985 కర్తవ్య
13 1985 నన్న ప్రతిజ్ఞె
14 1987 సత్యం శివం సుందరం
15 1989 ఒందాగి బాళు
16 1989 రుద్ర
17 1992 శివ నాగ
18 1992 నన్న శతృ
19 1995 స్టేట్ రౌడీ
20 2000 బిల్లా రంగా

తమిళ సినిమాలుసవరించు

క్ర.సం. విడుదల సం. సినిమా పేరు
1 1972 పెన్నింగ్ సవాల్
2 1983 నాన్ నినైథల్
3 2000 నాగతమ్మన్

మలయాళ సినిమాలుసవరించు

క్ర.సం విడుదల సం. సినిమా పేరు
1 1976 కళ్ళనం కుళ్ళనం

హిందీ సినిమాలుసవరించు

క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 రాణీ మేరా నామ్ (1972)
2 పిస్తోల్‌వాలీ (1972)
3 అప్నా ఫర్జ్ (1973)
4 బహద్దూర్ ఖిలాడియోఁ (1973)
5 హిఫాజత్ (1973)
6 రాణీ ఔర్ జానీ (1973) (కథ, దర్శకత్వం)
7 చోర్ కా భాయ్ చోర్ (1978)
8 దిలేర్ (1979)
9 బ్లాక్ కోబ్రా (1981)
10 తాకత్‌వాలా (1984)
11 ముల్జిమ్ (1988)

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-12-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
  2. సాక్షి, ఫ్యామిలీ (5 January 2015). "ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!". డా. పురాణపండ వైజయంతి. మూలం నుండి 20 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 20 February 2019. Cite news requires |newspaper= (help)
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-09-15. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

ఐ.ఎం.డి.బి.లో కె.ఎస్.ఆర్.దాస్ పేజీ