దొంగనోటు

(దొంగ నోట్లు నుండి దారిమార్పు చెందింది)

దొంగనోటు లేదా నకిలీ నోటు అనగా అనధికారికంగా ఒక దేశపు ద్రవ్య మారకమును ముద్రించి చలామణి చేయడము. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తాయి.

Plated counterfeit of the Roman emperor Domitian. By using a copper core covered in a silver coating, the coin has a much lower intrinsic value, while face value remains the same.

భారతదేశంలో దొంగ నోట్లు

మార్చు

ఐదు రూపాయల నకిలీ నోట్లు

మార్చు

మీ జేబులో ఐదు రూపాయల నోటు ఉంటే.. బహుశా అది నకిలీ నోటు కావొచ్చు. మళ్లీ ఎప్పుడైనా మీ చేతికి ఐదు రూపాయల నోటు వస్తే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. 2013 సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఐదు రూపాయల నోట్లను స్వాధీన పరుచుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. నకిలీ ఐదు రూపాయల నోట్ల వ్యవహారం వినియోగదారులనే కాకుండా, ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది.[1]

భారీ మొత్తంలో నకిలీ నోట్ల సరఫరాలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ది ప్రధాన పాత్ర అని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్లపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఓ ఆసక్తికరమైన అంశం దృష్టికి వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీ, ముల్తాన్, క్వెట్టా, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ భారతీయ కరెన్సీ ప్రింట్ అవుతోందనే సమాచారం అందింది. నకిలీ నోట్లన్ని గుర్తుపట్టని రీతిలో దాదాపు ఒరిజినల్ నోట్లుగానే చెలామణీలో ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. గతంలో నకిలీ నోట్లన్ని హై డినామినేషన్ లో వచ్చేవని... నకిలీ నోట్ల సరఫరాలో ప్రస్తుతం మాఫియా వ్యూహాన్ని మార్చారని పోలీసుల తెలిపారు. గతంలో 1000, 500 నోట్లు మాత్రమే నకిలీ నోట్లుగా వచ్చేవని.. ఐతే తక్కువ విలువ నోట్లను మార్పిడి చేయడానికి అంతగా కష్టం ఉండకపోవడంతో పాక్ నకిలీ కరెన్సీ మాఫియా 5 రూపాయలను ఎంచుకుందని ఉన్నతాధికారులు తెలిపారు.

గత మూడేళ్లుగా 5, 10, 20 రూపాయల నకిలీ నోట్లను భారత్ లోకి ప్రవేశపెట్టి.. భారీ ఎత్తున ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మాఫియా చెలామణిలోకి తీసుకువస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. కేవలం 2013 సంవత్సరంలో 5.66 కోట్ల రూపాయల భారతీయ నకిలీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను, 20,517 వంద రూపాయల నోట్లను, 60,525 ఐదు వందల నోట్లను, 24,116 వెయి రూపాయల నోట్లను స్వాధీన పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ పేపర్, ఇంక్, మాగ్నటిక్ దారాన్ని పాక్ మాఫియా భారతీయ కరెన్సీ ప్రింటింగ్ కు వినియోగిస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు.[2]

మన రాష్ట్రంలో దొంగనోట్ల మోసాలు

మార్చు

మన రాష్ట్రంలో 2013 సంవత్సరంలో జరిగిన కొన్ని దొంగనోట్ల మోసాలు.

మైదుకూరు : నకిలీ నోట్ల ముఠా అరెస్టు

మార్చు

2013 మే నలలో కడప జిల్లాలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠాను మైదుకూరు డీఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఖాజీపేట ఎస్‌ఐ మంజునాథరెడ్డి, సిబ్బందితో అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన అజ్‌ఘర్ జైనల్, వాసీంజైనల్ అనే వారి దగ్గరి నుంచి జమ్మలమడుగు, పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన పోస్ట్‌మేన్ దుర్గం చంద్రబోస్ నకిలీ కరెన్సీని తీసుకొచ్చి అతని అనుచరుల ద్వారా రాష్ట్రంలో చెలామణి చేస్తుండే వారన్నారు. ప్రధాన నిందితుడు దుర్గం చంద్రబోస్ ఒరిజినల్ నోట్లను పశ్చిమబెంగాల్‌లోని వారికిచ్చి అంతకు రెట్టింపు నకిలీ నోట్లను తీసుకొచ్చేవాడన్నారు. తమకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖాజీపేటలో కడప-కర్నూలు ప్రధాన రహదారిలో సాయిబాబా గుడి వద్ద ఈ నకిలీ నోట్ల ముఠాను డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఖాజీపేట ఎస్‌ఐ మంజునాథరెడ్డిలు తమ సిబ్బందితో అరెస్టు చేశారన్నారు.

వారి వద్దనుంచి రూ.12.50లక్షల విలువైన నకిలీ కరెన్సీని రూ.6,500 నగదును, హోండా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో దుర్గం చంద్రబోస్‌తోపాటు కర్నూలు జిల్లా దొర్నిపాడుకు చెందిన సంగు సుబ్బరాయుడు, మునుస్వామి, అవుకుకు చెందిన రామతులసి, పాలూరుకు చెందిన షేక్ షామీర్,జమ్మలమడుగుకు చెందిన కౌశిక్ నాగరాజు, దేవగుడికి చెందిన ఆవుల మరియమ్మలు ఉన్నారన్నారు. ఈ ముఠాలో మహిళ ఆవుల మరియమ్మ కూడా పాలుపంచుకోవడం గమనార్హమన్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో వెయ్యి రూపాయల నోట్లు 810, ఐదు వందల రూపాయల నోట్లు 915 ఉన్నాయన్నారు. ముఠాలోని సంగు సుబ్బరాయుడును గతంలో కర్నూలు జిల్లాలోని నకిలీ నోట్ల కేసులో నిందితుడుగా ఉన్నారన్నారు. ఇతన్ని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారన్నారు. ఇతని ద్వారానే జమ్మలమడుగుకు చెందిన దుర్గం చంద్రబోస్, పశ్చిమబెంగాల్‌కు చెందిన అజ్‌ఘర్ జైనల్, వాసీం జైనల్‌ను పరిచయం చేసుకొని నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నాడన్నారు. అరెస్టు అయిన వారందరినీ మైదుకూరు కోర్టుకు రిమాండు కోసం పంపిస్తామన్నారు. కాగా రాత్రివేళల్లో ప్రజలు సంచరించేటపుడు తగిన ఆధారాలతో ఉండాలని ఎస్పీ తెలిపారు. ఈ నెల 9వ తేది నుంచి కఠినంగా వ్యవహరించడం వలన ఎలాంటి నేరాలు జరగడం లేదన్నారు. ప్రజలందరూ సహకరిస్తే మరింత చోరీ రహితంగా చర్యలు తీసుకుంటామన్నారు.[3]

కడప: నకిలీనోట్లతో ఏడుగురి అరెస్ట్

మార్చు

2013 లో వైఎస్ఆర్ జిల్లా కడపలో దొంగనోట్ల ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు పశ్చిమ బెంగాల్ నుంచి దొంగనోట్లను తీసుకు వచ్చి ఇక్కడ చెలామణి చేస్తున్నారని పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి లక్షా 50 వేల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు[4].

మాచర్ల: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించే ముఠా అరెస్ట్

మార్చు

మాచర్లలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి లక్షా 36వేల నకిలీ కరెన్సీ, కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు[5]

విశాఖపట్నం

మార్చు

2013 లో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పోలీసులు నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు.తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన బాబిరెడ్డి నకిలీనోట్ల చెలామణిలో ఘనాపాటి. రెండునెలల క్రితం అతను భీమడోలులో పోలీసులకు చిక్కి రాజమండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని అనుచర గణం మాత్రం నకిలీనోట్ల వ్యవహారం కొనసాగిస్తోంది. గతంలో బాబిరెడ్డి ఇచ్చిన నోట్లతో జనాన్ని మోసం చేసే ముఠా చినముషిడివాడ కేంద్రంగా విశాఖ నగరంలో సొంతంగా వ్యవహారాలు నడుపుతోంది. మేడపాటి కనకదుర్గా ప్రసాదరెడ్డి, అతని తండ్రి సత్తిరెడ్డి, నాతయ్యపాలెంలో ఉంటున్న సత్తి వెంకటరెడ్డి కలిసి లేజర్ ప్రింటర్లు, కట్టర్లు కొనుగోలు చేశారు. వీటి ద్వారా కేవలం తెల్లకాగితాలతో నకిలీనోట్లు ముద్రిస్తున్నారు. అచ్చం కరెన్సీనోట్ల మాదిరిగా ఇవి కనిపిస్తున్నాయి. రూ.500, రూ.1000, రూ.100 నోట్లు మార్కెట్లో విడుదలకు ఓ పథకం వేశారు. వీటితో సిగరెట్ పెట్టెలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

వాటిని మారుమూల కాలనీలు, గ్రామాల్లో తక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ తతంగంపై గోపాలపట్నం సీఐ కుమారస్వామికి శనివారం ఉదయం సమాచారం అందింది. ఎస్‌ఐ వెంకటస్వామి, హెచ్‌సీలు దుర్గారావు, భాషా, పీసీలు బాలాజీ, రవి, మూర్తి, నవీన్‌లతో గోశాల జంక్షన్‌లో మాటువేశారు. ఇక్కడ ఓ దుకాణం వద్ద సిగరెట్‌పెట్టెలు విక్రయిస్తుండగా ప్రసాదరెడ్డి, సత్తిరెడ్డి, వెంకటరెడ్డిలను పట్టుకున్నారు. వీరిని విచారించి మూడు ప్రింటర్లు, రూ.లక్షా 45 వేల నకిలీనోట్లు, రూ.46వేల కరెన్సీ, సిగరెట్ పెట్టెలు, మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.[6]

తాళ్ళపూడి : నకిలీ నోటు మారుస్తూ చిక్కిన వ్యక్తి

మార్చు

2013 మే నెలలో నకిలీ నోట్లు మారుస్తున్న ఇద్దరిలో ఒకరిని మలకపల్లె గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన నల్లాకుల పెదకాపు కిళ్లీషాపులో శనివారం సాయంత్రం అతని భార్య సుబ్బలక్ష్మి ఉండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సిగరెట్లు కావాలని అడిగారు. జేబులోంచి రూ.100 నోటు తీసి ఇవ్వబోతూ ఆగి మరో జేబులోని రూ.100 నోటు తీసిచ్చారు. వీరిద్దరూ గతంలో రెండు సార్లు ఈ షాపుకు వచ్చి ఇలాగే కొనుక్కుని నకిలీ రూ.100 నోట్లు ఇచ్చారు. వాటిని కిళ్లీషాపు యజమాని కూల్‌డ్రింక్స్ కొనేందుకు ఇవ్వగా వారు దొంగనోటు అని నిర్ధారించడంతో దాన్ని చించేశారు. మరో నోటును మాత్రం ఉంచారు. శనివారం వచ్చిన ఆ ఇద్దరికి ఆ నోటును చూపించి ప్రశ్నించగా అక్కడ నుంచి జారుకోవటానికి ప్రయత్నించారు. ఇంతలో పక్కన ఉన్నవారు కేకలు వేయడంతో స్థానికులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక వ్యక్తి చిక్కాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. చిక్కిన వ్యక్తి రాజమండ్రికి చెందిన కె.వీరారెడ్డి అని తెలిపారు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.[7]

మూలాలు

మార్చు
  1. http://timesofindia.indiatimes.com/india/The-Rs-5-note-in-your-hand-may-be-fake/articleshow/29061112.cms
  2. http://news.oneindia.in/india/beware-indians-now-rs-5-could-be-fake-note-pakistan-isi-conspiracy-1379971.html[permanent dead link]
  3. http://www.thehindu.com/todays-paper/tp-national/3-held-fake-currency-seized/article934627.ece/
  4. http://www.siasat.com/english/news/fake-currency-racket-busted-kadapa
  5. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/fake-currency-racket-busted-two-held/article4741452.ece
  6. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/fake-currency-racket-busted/article1815759.ece
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-20. Retrieved 2014-09-01. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దొంగనోటు&oldid=4218755" నుండి వెలికితీశారు