ప్రధాన మెనూను తెరువు

మైదుకూరు

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం లోని గ్రామం

మైదుకూరు (ఆంగ్లం: Mydukur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, మైదుకూరు మండలం లోని పట్టణం.[1] ఈ పట్టణము రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కినది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణము ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.

విషయ సూచిక

గ్రామ చరిత్రసవరించు

ఈ పట్టణము లోని ప్రసిద్ధ మాధవరాయ స్వామి పేరు మీదుగా ఈ పట్టణానికి మాధవకూరు, క్రమేణా మైదుకూరు అనే పేరు స్ఠిరపడినది అని చెబుతారు.

నేస్తం సేవా సంస్థసవరించు

మైదుకూరు నేస్తం సేవా సంస్థ

13/614-A1, Srihari Nagar, Kadapa Road Mydukur, 07780190069 09440425613

ఆదిమ మానవుని అవశేశాలుసవరించు

2014 వ సంవత్సరంలో కడప యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ మైదుకూరు రాణిబావి వద్ద ఉన్న మల్లుగానిబండపై ఆదిమానవుని రేఖాచిత్రాలను గుర్తించారు. ఆ చిత్రాలను అధ్యయనం చేసి అవి కొన్ని బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగానికి చెందినవిగా చరిత్ర అధ్యాపకులు తేల్చారు. ఆ చిత్రాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ 2014 నవంబరు 30 శనివారం విడుదల చేశారు. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ శ్రీనివాసులు, మైదుకూరుకు చెందిన రాజేష్ రేఖచిత్రాలను కనుగొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు జాతీయ రహదారి నంబరు 26 నుంచి 9 కిలోమీటర్ల దక్షణం వైపు కడప హరివనం (కడప బేసిన్) రూపాంతర ప్రాప్త అవశేష శిలలతో నిర్మితమై ఉందన్నారు. ఈ శిలలను క్వార్త్జెట్ శిలలంటారని చెప్పారు. ఇవి కార్జ, ఐరన్ ఆక్సైడ్‌లతో నిర్మితమై ఉంటాయి. ఈ రాతి నివాసం స్థానికంగా దివిటి మల్లన్న బండ, మల్లుగానిబండ పేరుతో పిలుస్తారని తెలిపారు. ఈ రాతి ఆవాసంలో సుమారు 100 వరకు మానవుల, జంతువుల రేఖాచిత్రాలు వివిధ భంగిమల్లో తెల్లని రంగుతో చిత్రించారన్నారు. త్రిశూలాన్ని ధరించిన మానవులు, తోడేలుపై చేతిలో రెండు వైపులా త్రిశూలాన్ని ధరించిన మనిషి ప్రయాణం, బంతిని చేతబట్టిన మానవులు, తలకు కవచం, గుర్రంపై ఖడ్గంతో పల్లకిలో ప్రయాణించే వీరుడు, గాడిదలతో తలపడే సన్నివేశాలు, చెట్టుపై తేనెపట్టు ఇలా పలు రకాల రేఖాచిత్రాలు గుర్తించామన్నారు. ఇవి కెయోలిన్ అనే బంకమన్నుతో గీశారని వేల సంవత్సరాల కాలం నాటివిగా వివరించారు. ఆదిమానవులు ఉమ్మిని, జంతువుల కొవ్వును, ఎముకల పొడిని జిగురు పదార్థంగా ఉపయోగించారని చెప్పారు.[2]

పాడి పంటలుసవరించు

ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, కృష్ణాపురం ఉల్లి, పసుపు, ప్రొద్దు తిరుగుడు, మిరప, టమేటా పంటలు సాగు చేస్తారు. ఇక్కడ పండంచే కృష్ణాపురం ఉల్లికి సింగపూర్, శ్రీలంక తదితర దేశాలలో మంచి గిరాకీ ఉంది. ఈ ప్ర్రాంతంలో పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ది చెందింది. ప్రతి శనివారం జరిగే 'సంత' లో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.

శాసనసభ నియోజకవర్గంసవరించు

పూర్తి వ్యాసం మైదుకూరు శాసనసభ నియోజకవర్గంలో చూడండి.సవరించు

ప్రధాన సమాచారముసవరించు

 
తంతి తపాలా ప్రధాన కేంద్రము

దర్శనీయ ప్రదేశాలుసవరించు

 
కడప మార్గం లోని షాహీ మసీదు
 • శ్రీ పిచ్చమాంబ మఠం, వనిపెంట రోడ్డు, పోరుమామిళ్ళ మార్గము
 • కొత్త పాలెం శ్రీ ఆంజినెయ స్వామి, కొత్త పాలెం, కడప మార్గము
 • శ్రీ షిర్దీసాయిబాబా దేవాలయము, కడప మార్గము
 • షాహి మసీదు, కడప మార్గము
 • మాధవరాయ స్వామి దేవాలయము, నంద్యాల మార్గము
 • సి.యస్.ఐ. షాలోము చర్చి, సాయినాధపురము
 • శ్రీ రాములవారి గుడి, నంద్యాల మార్గము
 • పంచముఖ ఆంజనేయ దేవాలయము, పార్వతీ నగర్, నంద్యాల మార్గము
 • వాసవి కన్యక పరమెస్వరి ఆలయము,నంద్యాల మార్గము

విద్యా సంస్థలుసవరించు

ప్రభుత్వ విద్యాసంస్థలుసవరించు

 • మండల పరిషత్ ప్రాథమిక పాఠసశాల, కడప మార్గము
 • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కడప మార్గము
 • రవీంద్ర జూనియర్ కళాశాల, కడప మార్గము
 • బాలశివ కళాశాల, వనిపెంట మార్గము

ప్రైవేటు విద్యాసంస్థలుసవరించు

 • శాంతినికేతన్ ఉన్నత పాఠశాల, బద్వేలి మార్గము.
 • శారదా ఉన్నత పాఠశాల, కడప మార్గము
 • వశిష్ట ఉన్నత పాఠశాల, బద్వేలి మార్గము.
 • శివసూర్య ఉన్నత పాఠశాల, ప్రొద్దుటూరు మార్గము.
 • ఆర్.వి.ఎస్.ఆర్.యమ్ ఉన్నత పాఠశాల, కడప మార్గము
 • టీ.వీ.ఎస్.ఎం. ఉన్నత పాఠశాల,బద్వేలి మార్గము.
 • సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల,బద్వేలి మార్గము.
 • మేధా జూనియర్ కళాశాల, కడప మార్గము.

ఆసుపత్రులుసవరించు

రక్తనిధి కేంద్రముసవరించు

 • శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు గత 9 సంవత్సరములుగా 1000 మందికి రక్తదానాన్ని అందించారు.[3]. అత్యవసర పరిస్థితులలో రక్తం కావలసినవారి ఈ కేంద్ర సభ్యులైన ఆకుల వెంకట శివరాం (9885040477) ని కాని లేదా దాసారెడ్డిగారి ఓబయ్య (9030631910) నికాని సంప్రదించగలరు. ఈ బృందసభ్యులు అన్ని వేళలా రక్తదానానికి అందుబాటులో ఉంటూ ఎందరో ప్రాణాలకు ఊపిరి పోసారు. జిల్లా వ్యాప్తముగా అనేక పురస్కారాలను ఆందుకొన్నారు.

బ్యాంకులుసవరించు

అన్నశాలలుసవరించు

 • గుడ్ బాయ్ అన్నశాల, కడప మార్గము
 • మానస అన్నశాల, కడప మార్గము
 • బృందావన్ అన్నశాల, కడప మార్గము
 • రాఘవేంద్ర అన్నశాల,బద్వేలి మార్గము

వసతి గృహాలుసవరించు

 • ప్రతాప్ వసతి గృహము,బద్వేలి మార్గము
 • శ్రీలేఖ వసతి గృహము,బద్వేలి మార్గము
 • విజయ వసతి గృహము, కడప మార్గము
 • వేంకటేశ్వర వసతి గృహము,బద్వేలి మార్గము

చలనచిత్ర ప్రదర్శనశాలలుసవరించు

 • భారత్
 • వేంకటేశ్వర
 • విజయ్
 • కిరణ్
 • దేవి

రవాణా వ్యవస్థసవరించు

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ, కడప మార్గము
   
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ బస్సులు నిలుచు ప్రధాన కేంద్రము

మండల గణాంకాలుసవరించు

మండల కేంద్రము మైదుకూరు
గ్రామాలు 16
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 72,356 - పురుషులు 36,899 - స్త్రీలు 35,457
అక్షరాస్యత (2001) - మొత్తం 57.58% - పురుషులు 72.68% - స్త్రీలు 41.91%

మండల పరిధి లోని గ్రామాలుసవరించు

రాజకీయ సమాచారముసవరించు

 • ప్రస్తుత ప్రజా ప్రతినిధిగా డి.ఎల్.రవీంద్రా రెడ్ది, కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిక కాబడ్దారు. ఈయన 2014 వరకు ఈ పదవిలో కొనసాగుతాడు.
 • 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి, ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి త్రిముఖ పొటీలో పాల్గొన్నారు.వీరిలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థులపై విజయం సాధించారు.

మూలాలుసవరించు

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. ""మైదుకూరు రాణిబావి వద్ద రేఖాచిత్రాలు - బృహత్ శిలాయుగానికి చెందినవిగా తేల్చిన చరిత్రకారులు"". www.eenad.net. ఈనాడు. 30 నవంబర్ 2014. Retrieved 30 నవంబర్ 2014. Check date values in: |accessdate=, |date= (help)
 3. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=kadapa#12

బయటి లింకులుసవరించు"https://te.wikipedia.org/w/index.php?title=మైదుకూరు&oldid=2702677" నుండి వెలికితీశారు